Share News

తెల్ల జుట్టును నల్లగా మార్చే సహజ చిట్కా!

ABN , Publish Date - Mar 24 , 2026 | 02:51 PM

తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా? ఖరీదైన హెయిర్ డైలకు బదులుగా ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి. తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారే అవకాశం ఉంటుంది.

తెల్ల జుట్టును నల్లగా మార్చే సహజ చిట్కా!
White Hair Natural Remedy

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, విపరీతమైన ఒత్తిడి, పోషకాహార లోపం (విటమిన్ B12, ఐరన్, కాపర్), జన్యుపరమైన కారణాల వల్ల చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడుతోంది. మెలనిన్ అనే వర్ణద్రవ్యం తగ్గడం వల్ల వెంట్రుకలు తెల్లగా, బూడిద రంగులోకి మారుతాయి. ధూమపానం, థైరాయిడ్ సమస్యలు, కాలుష్యం కూడా తెల్ల జుట్టుకు కారణమవుతున్నాయి. అయితే, మీ జుట్టు తెల్లగా మారిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిమ్మరసం, ఉల్లిపాయ రసం ఉపయోగించి మీ తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చుకోవచ్చు.


తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి తప్పనిసరిగా హెయిర్ డై లేదా హెన్నా వాడాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ, నిమ్మరసం సహాయంతో కూడా ఈ సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు. సల్ఫర్ ఎక్కువగా ఉండే ఉల్లిపాయ.. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఉల్లిపాయ రసం జుట్టు తెల్లబడటాన్ని తగ్గించే ‘కెటలేస్’ అనే ఎంజైమ్ ఉత్పత్తిని పెంచుతుంది. అంతేకాకుండా జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. నిమ్మరసం జుట్టుకు సహజమైన మెరుపును అందిస్తుంది. ఇది చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.


తెల్ల జుట్టును నల్లగా మార్చే సహజ చిట్కా!

  • తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి 2–3 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ రసం, 1 టీస్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె అవసరం.

  • ఒక గిన్నెలో ఉల్లిపాయ రసం, ఆలివ్ నూనె, నిమ్మరసం తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి 5 నిమిషాల పాటు మెల్లగా మసాజ్ చేయాలి.

  • తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు అంతా బాగా పట్టించి సుమారు ఒక గంట పాటు ఉంచాలి. అనంతరం గోరువెచ్చని నీటితో, మైల్డ్ షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల తెల్ల జుట్టు సహజంగా నల్లబడటానికి సహాయపడుతుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు. దీనిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Also Read:

వాణిజ్య సిలిండర్ కొరత.. కుదేలవుతున్న ఫుడ్ ఇండస్ట్రీ

పేదలను వెళ్లగొట్టు.. ఒవైసీని కాపాడు

For More Latest News

Updated Date - Mar 24 , 2026 | 02:56 PM