గ్యాస్ స్టవ్ కంటే ఇండక్షన్ స్టవ్ మంచిదా?
ABN , Publish Date - Mar 18 , 2026 | 04:22 PM
గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో చాలా మంది ఇండక్షన్ స్టవ్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే.. గ్యాస్ స్టవ్, ఇండక్షన్ స్టవ్‌లలో వంటకు ఏది సరైనదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. సరఫరాలో అంతరాయాల కారణంగా LPG అందుబాటులో లేకపోవడం గృహాలకు పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా నగరాల్లో నివసించే వారు వంట కోసం ఇండక్షన్ స్టవ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో గ్యాస్ స్టవ్, ఇండక్షన్ స్టవ్‌లలో వంటకు ఏది మంచిదో తెలుసుకోవడం అవసరంగా మారింది.
వంట వేగం
ఇండక్షన్ స్టవ్‌పై వంట చాలా త్వరగా పూర్తవుతుంది. ఇది నేరుగా పాత్రను వేడి చేసే టెక్నాలజీతో పనిచేస్తుంది. నీళ్లు మరిగించడం, పాలు వేడి చేయడం వంటి పనులు చాలా తక్కువ సమయంలో పూర్తవుతాయి. గ్యాస్ స్టవ్‌తో పోలిస్తే సమయం ఆదా అవుతుంది.

భద్రత పరంగా
ఇండక్షన్ స్టవ్ భద్రత విషయంలో ముందుంటుంది. గ్యాస్ లీక్ అవ్వడం, మంట వ్యాపించడం వంటి ప్రమాదాలు ఉండవు. పాత్ర పెట్టినప్పుడే వేడి అవుతుంది. అలాగే ఆటోమేటిక్ ఆఫ్ వంటి ఫీచర్లు ఉండటం వల్ల ప్రమాదాలు తగ్గుతాయి. చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో ఇది మరింత సురక్షితం.

శుభ్రపరిచే సౌలభ్యం
గ్యాస్ స్టవ్‌ను శుభ్రం చేయడం కొంచెం కష్టమే. బర్నర్లు, స్టాండ్లు విడిగా శుభ్రం చేయాలి. కానీ ఇండక్షన్ స్టవ్ ఫ్లాట్ సర్ఫేస్ ఉండటం వల్ల ఒక గుడ్డతో తుడిచినా చాలు, సులభంగా శుభ్రం అవుతుంది.
వాడకంలో సౌకర్యం
ఇండక్షన్ స్టవ్‌ను ఎక్కడికైనా తీసుకెళ్లడం చాలా ఈజీ. ప్లగ్ పాయింట్ ఉంటే సరిపోతుంది. గ్యాస్ స్టవ్ మాత్రం సిలిండర్‌పై ఆధారపడుతుంది.
ఖర్చు
విద్యుత్ ఖర్చు కొద్దిగా పెరిగినా, గ్యాస్ కొరత ఉన్న సమయంలో ఇండక్షన్ స్టవ్ మంచి ప్రత్యామ్నాయం. అలాగే కొత్త మోడల్స్‌లో పవర్ సేవింగ్ ఫీచర్లు ఉండటం వల్ల కరెంట్ వినియోగాన్ని కూడా తగ్గించవచ్చు.
రోజువారీ వంటకు గ్యాస్ స్టవ్ ఇప్పటికీ సౌకర్యవంతమైన ఎంపిక. అయితే వేగం, భద్రత, వినియోగం విషయంలో ఇండక్షన్ స్టవ్ మెరుగ్గా ఉంటుంది. కాబట్టి మీ అవసరాలకు అనుగుణంగా సరైన ఎంపిక చేసుకోవడం మంచిది.
Also Read
వేసవిలో బయటకు వెళ్లే ముందు ఈ స్కిన్‌కేర్ తప్పనిసరి
బొప్పాయి తినడానికి సరైన సమయం తెలుసా?
For More Latest News