Share News

ఆరోగ్యానికి ఏ పాలు మంచివో తెలుసా?

ABN , Publish Date - Feb 26 , 2026 | 03:56 PM

పాలు మన ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన పోషకాహారం. అయితే ఆవు పాలు మంచివా లేదా బర్రె పాలు మంచివా అనే సందేహం చాలామందికి ఉంటుంది.

ఆరోగ్యానికి ఏ పాలు మంచివో తెలుసా?
Milk Health Benefits

ఇంటర్నెట్ డెస్క్: మన రోజువారీ ఆహారంలో పాలు చాలా ముఖ్యమైనవి. పాలు శరీరానికి అవసరమైన ప్రొటీన్, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు వంటి ఎన్నో పోషకాలను అందిస్తాయి. అందుకే పాలను సంపూర్ణ ఆహారం అని కూడా అంటారు. అయితే చాలా మందికి ఆవు పాలు మంచివా లేదా బర్రె పాలు మంచివా అనే సందేహం ఉంటుంది. వాటిలో ఉన్న పోషకాలు, జీర్ణశక్తి, ఆరోగ్య ప్రయోజనాలను బట్టి ఏ పాలు మీకు సరైనవో తెలుసుకోవడం అవసరం.


కాల్షియం పరంగా ఏది మంచిది?

ఎముకలు, దంతాల బలానికి కాల్షియం చాలా అవసరం. బర్రె పాలలో కాల్షియం పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 100 మిల్లీలీటర్ల ఆవు పాలలో సుమారు 120 మి.గ్రా కాల్షియం ఉంటే, అదే పరిమాణంలో బర్రె పాలలో సుమారు 180 మి.గ్రా కాల్షియం ఉంటుంది. అందువల్ల ఎముకల బలహీనత ఉన్నవారు, గర్భిణులు, లేదా అదనపు కాల్షియం అవసరమైనవారికి బర్రె పాలు ఉపయోగకరంగా ఉంటాయి.


జీర్ణం కావడంలో ఏది సులభం?

ఆవు పాలలో కొవ్వు తక్కువగా ఉండటం వల్ల అవి తేలికగా జీర్ణమవుతాయి. దీనివల్ల శరీరం పోషకాలను సులభంగా గ్రహిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఆవు పాలు మంచి ఎంపిక. మరోవైపు బర్రె పాలలో కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల అవి జీర్ణం కావడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది.


శక్తి కోసం ఏది మంచిది?

బర్రె పాలు చిక్కగా ఉండి ఎక్కువ కొవ్వు, ప్రోటీన్ కలిగి ఉంటాయి. ఇవి శరీరానికి ఎక్కువ శక్తిని అందిస్తాయి. శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారు లేదా బరువు పెరగాలనుకునే వారు బర్రె పాలు తీసుకోవచ్చు.

ఎవరికి ఏ పాలు మంచివి?

చిన్నపిల్లలు, వృద్ధులకు ఆవు పాలు మంచివి. ఎక్కువ శక్తి, కాల్షియం అవసరమైనవారికి బర్రె పాలు మంచివని నిపుణులు సూచిస్తున్నారు. ఆవు పాలు, బర్రె పాలు రెండూ ఆరోగ్యానికి మంచివే. అయితే మీ వయస్సు, ఆరోగ్య పరిస్థితి, జీర్ణశక్తి, శారీరక శ్రమను బట్టి ఏ పాలు తాగాలో నిర్ణయించుకోవాలి.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

యువతలో బీపీ పెరగడానికి కారణం తెలుసా?

పాదాలలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!

For More Latest News

Updated Date - Feb 26 , 2026 | 04:08 PM