నిమ్మకాయ కొనేటప్పుడు ఈ చిట్కాలు పాటించండి
ABN , Publish Date - Mar 12 , 2026 | 08:54 AM
వేసవిలో చాలా మంది నిమ్మకాయలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే, నిమ్మకాయలు కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
ఇంటర్నెట్ డెస్క్: వేసవిలో నిమ్మకాయలకు డిమాండ్ పెరుగుతుంది. వేడి తగ్గించుకోవడానికి చాలా మంది నిమ్మరసం వంటి పానీయాలు తయారు చేస్తుంటారు. నిమ్మకాయల్లో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో అవి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.
మార్కెట్లో సాధారణంగా గుండ్రంగా ఉండే నిమ్మకాయలు, పొడవుగా ఉండే నిమ్మకాయలు అనే రెండు రకాలూ కనిపిస్తాయి. అయితే వీటిలో ఏ నిమ్మకాయలో ఎక్కువ రసం ఉంటుందో చాలామందికి సందేహం ఉంటుంది. సాధారణంగా పొడవైన నిమ్మకాయలతో పోలిస్తే గుండ్రని నిమ్మకాయల్లో ఎక్కువ రసం ఉంటుంది. అయితే నిమ్మకాయను ఎంచుకునే సమయంలో కొన్ని చిన్న విషయాలు గమనిస్తే ఎక్కువ రసం ఉన్న నిమ్మకాయను సులభంగా గుర్తించవచ్చు.
నిమ్మకాయను ఎంచుకునే చిట్కాలు:
నిమ్మకాయ పరిమాణం చిన్నగా ఉన్నా చేతిలో పట్టుకున్నప్పుడు బరువుగా అనిపిస్తే అందులో ఎక్కువ రసం ఉండే అవకాశముంది.
బరువుగా ఉన్న నిమ్మకాయల్లో గుజ్జు ఎక్కువగా ఉంటుంది. గుజ్జు ఎక్కువగా ఉంటే రసం కూడా ఎక్కువగా వస్తుంది.
సన్నని, మృదువైన తొక్క ఉన్న నిమ్మకాయల్లో సాధారణంగా ఎక్కువ రసం ఉంటుంది. మందమైన లేదా గట్టిగా ఉన్న తొక్కల నిమ్మకాయల్లో రసం తక్కువగా ఉండొచ్చు.
ముదురు పసుపు రంగులో ఉన్న నిమ్మకాయలు పూర్తిగా పండినవిగా ఉంటాయి. అందులో రసం కూడా ఎక్కువగా ఉంటుంది. లేత ఆకుపచ్చ రంగులో ఉన్న నిమ్మకాయల్లో రసం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
Also Read
వేసవిలో బయటకు వెళ్లే ముందు ఈ స్కిన్‌కేర్ తప్పనిసరి
బొప్పాయి తినడానికి సరైన సమయం తెలుసా?
For More Latest News