స్టార్ ఫ్రూట్.. రుచితో పాటు ఆరోగ్యం
ABN , Publish Date - Feb 07 , 2026 | 11:04 AM
నక్షత్రం ఆకారంలో కనిపించే స్టార్ ఫ్రూట్ కేవలం ఆకర్షణీయమైన పండే కాదు, ఆరోగ్యానికీ ఎంతో మేలు చేసే ఫలం. విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో నిండిఉన్న ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: స్టార్ ఫ్రూట్‌ను కరంబోలా(Carambola) అని కూడా అంటారు. ఇది రుచికరమైన, పోషకమైన ఉష్ణమండల పండు. దీనిని కట్ చేసినప్పుడు నక్షత్రం ఆకారంలో కనిపిస్తుంది. అందువల్ల దీనికి స్టార్ ఫ్రూట్ అనే పేరు వచ్చింది. విటమిన్-సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే ఈ పండు.. గుండె ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికీ సాయపడుతుంది. తొక్కతో సహా తినదగిన ఈ ఫ్రూట్.. తీపి, పుల్లని రుచులలో లభిస్తుంది. సలాడ్లు, స్మూతీలలో బాగా ఉపయోగపడుతుంది.
పోషక విలువలు
విటమిన్-సి సమృద్ధిగా ఉంటుంది.
ఫైబర్ అధికంగా ఉంటుంది.
యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
తక్కువ క్యాలరీలు ఉంటాయి.
స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు
రోగనిరోధక శక్తి: స్టార్ ఫ్రూట్‌లోని విటమిన్-సి శరీర రక్షణ వ్యవస్థను బలపరుస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం తగ్గి జీర్ణక్రియ మెరుగవుతుంది.
బరువు నియంత్రణ: తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల బరువు తగ్గడంలో సాయపడుతుంది.
చర్మ కాంతి: యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడతాయి.
గుండె ఆరోగ్యం: కొలెస్ట్రాల్ నియంత్రణకు తోడ్పడుతుంది.
ఎలా తినాలి?
స్టార్ ఫ్రూట్‌ను బాగా కడిగిన తర్వాత, తొక్క తీయాల్సిన అవసరం లేకుండా నేరుగా కట్ చేసుకుని తినవచ్చు. దీని చర్మం, గింజలు కూడా తినదగినవే. కానీ రుచి కోసం విత్తనాలు తొలగించి, అంచులను కొద్దిగా కట్ చేసి తినడం మంచిది. అలాగే.. సలాడ్లలో లేదా జ్యూస్‌గానూ తీసుకోవచ్చు. మొత్తానికి, స్టార్ ఫ్రూట్ రుచికరమైనదే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలుచేసే ఫలం. రోజువారీ ఆహారంలో మితంగా చేర్చుకుంటే పలు లాభాలు పొందవచ్చు.
జాగ్రత్తలు
కిడ్నీ సమస్యలున్నవారు ఈ పండును తినకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కిడ్నీ వ్యాధులు ఉన్నవారిలో ఈ పండులోని 'కారాంబోక్సిన్' అనే పదార్థం నరాల సమస్యలను కలిగించవచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
మునగాకు సూప్ ఎలా చేయాలో తెలుసా?
మార్కెట్లో కల్తీ అల్లం.. కొనేముందు ఇది తెలుసుకోండి.!
For More Latest News