Share News

ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే

ABN , Publish Date - May 20 , 2026 | 09:40 AM

ఎండుద్రాక్షను రాత్రంతా పాలలో నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్తహీనత తగ్గించడం నుంచి జీర్ణక్రియ మెరుగుపరచడం వరకు అనేక విధాలుగా శరీరానికి మేలు చేస్తుందని పేర్కొంటున్నారు.

ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే
Raisins Soaked in Milk

ఇంటర్నెట్ డెస్క్: ఎండుద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రై ఫ్రూట్స్‌లో ఒకటి. సాధారణంగా వీటిని పాయసం, హల్వా వంటి తీపి వంటల్లో ఉపయోగిస్తారు. అయితే, ఈ మధ్యకాలంలో చాలామంది ఎండుద్రాక్షను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినడం అలవాటుగా చేసుకుంటున్నారు.

అయితే, ఎండుద్రాక్షను నీటిలో కాకుండా పాలలో నానబెట్టి తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. పాలు, ఎండుద్రాక్ష కలయిక వల్ల శరీరానికి కాల్షియం, ప్రొటీన్, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు అందుతాయి. ఇవి శరీర బలాన్ని పెంచడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని చెబుతున్నారు.


రక్తహీనత తగ్గించడంలో సహాయం

ఎండుద్రాక్షలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. పాలలో నానబెట్టిన ఎండుద్రాక్షను ఉదయాన్నే తింటే రక్తహీనత సమస్య తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో ఉన్న పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

ఎండుద్రాక్షలో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. పాలలో నానబెట్టడం వల్ల అవి మెత్తబడతాయి కాబట్టి జీర్ణం సులభంగా అవుతుంది.


గుండె ఆరోగ్యానికి మేలు

ఎండుద్రాక్షలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

చర్మం కాంతివంతంగా మారుతుంది

ఎండుద్రాక్షలోని పోషకాలు చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. పొడి చర్మం, మొటిమలు వంటి సమస్యలు తగ్గి ముఖం కాంతివంతంగా కనిపించడానికి సహాయపడతాయి.

బరువు తగ్గడంలో సహాయం

ఈ మిశ్రమంలో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో అతిగా తినే అలవాటు తగ్గి బరువు నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. అయితే, ఎండుద్రాక్షను కూడా మితంగా మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

సిగరెట్లు తాగకపోయినా పెదాలు నల్లగా ఉన్నాయా? ఈ చిట్కాలు ట్రై చేయండి

రాగి బాటిల్‌లో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు మాత్రం చేయొద్దు

Updated Date - May 20 , 2026 | 09:42 AM