Makar Sankranti 2026: సంక్రాంతి స్పెషల్.. నువ్వుల లడ్డూలు ఇలా ట్రై చేయండి..
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:23 AM
సంక్రాంతి పండుగ అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది పిండి వంటలు. ముఖ్యంగా ఈ పండుగలో నువ్వుల లడ్డూలు తినడం ఆనవాయితీ. శరీరానికి వేడి ఇచ్చే ఈ లడ్డూను పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా ఇష్టంగా తింటారు..
ఇంటర్నెట్ డెస్క్: మకర సంక్రాంతిని దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటారు. ఇది సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ. ఈ పండుగ సమయంలో నువ్వులు, బెల్లం తినే సంప్రదాయం ఉంది. అలాగే ఎన్నో రకాల సంప్రదాయ వంటకాలు కూడా చేస్తారు. ముఖ్యంగా సంక్రాంతికి చాలా మంది నువ్వుల లడ్డూలు చేసుకుంటుంటారు. ఇవి రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలు అందిస్తాయి.
నువ్వుల లడ్డూ తయారీకి కావలసిన పదార్థాలు..
తెల్ల నువ్వులు – 1 కప్పు
వేరుశనగలు – 1 కప్పు
బెల్లం – 1 కప్పు
ఏలకుల పొడి – అర టీస్పూన్
నెయ్యి – కొద్దిగా

నువ్వుల లడ్డూ తయారీ విధానం..
ముందుగా పాన్‌లో నువ్వులను తక్కువ మంటపై బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
తర్వాత అదే పాన్‌లో వేరుశనగలను వేయించి.. చల్లారాక తొక్క తీసేయాలి.
వేరుశనగలను మెత్తగా రుబ్బుకుని అందులో ఏలకుల పొడి కలపాలి.
ఇప్పుడు మరో పాన్‌లో నెయ్యి, బెల్లం వేసి కరిగించాలి.
బెల్లం కరిగిన తర్వాత వేయించిన నువ్వులు, వేరుశనగ పొడి వేసి బాగా కలపాలి.
స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం కొద్దిగా చల్లారనివ్వాలి.
చేతులకు నెయ్యి రాసుకుని చిన్న చిన్న బంతులుగా చేసుకోవాలి.
ఇలా చేస్తే రుచికరమైన, ఆరోగ్యకరమైన నువ్వుల లడ్డూలు సిద్దమవుతాయి.

నువ్వుల లడ్డూ ఆరోగ్య ప్రయోజనాలు..
నువ్వులు, వేరుశనగలు శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి.
నువ్వుల్లో కాల్షియం, ఐరన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.
వేరుశనగల్లో ప్రొటీన్, మంచి కొవ్వులు ఉంటాయి – ఇవి శక్తిని ఇస్తాయి.
బెల్లం రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News