Share News

జంక్ ఫుడ్‌కు బదులు ఇవి తినండి..

ABN , Publish Date - Mar 26 , 2026 | 04:42 PM

జంక్ ఫుడ్ ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. ఆకలిగా ఉన్నప్పుడు జంక్ ఫుడ్‌కు బదులుగా హెల్తీ స్నాక్స్ తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు.

జంక్ ఫుడ్‌కు బదులు ఇవి తినండి..
Healthy Snacks Instead of Junk Food

ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో పెద్దలు, పిల్లలు అన్న తేడా లేకుండా అందరికీ జంక్ ఫుడ్ తినే అలవాటు పెరుగుతోంది. సాయంత్రం కొద్దిగా ఆకలి వేస్తే చాలామంది జంక్ ఫుడ్, చిప్స్, బిస్కెట్లు వంటి వాటిని తింటున్నారు. ఇవి రుచిగా ఉన్నప్పటికీ, ఎక్కువగా తింటే ఆరోగ్యానికి హానికరం.

జంక్ ఫుడ్‌లో పోషకాలు తక్కువగా ఉండి కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో చక్కెర, ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఆకలిగా ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


పండ్లు

ఆపిల్, అరటి, బొప్పాయి, జామ వంటి పండ్లు తినడం మంచిది. ఇవి రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి ఉపయోగకరమైనవి.

డ్రై ఫ్రూట్స్

బాదం, వాల్‌నట్స్, జీడిపప్పు, ఎండుద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్ ఆకలిని తగ్గించడంలో సహాయపడతాయి.

Dry fruits (1).jpg

పెరుగు లేదా మజ్జిగ

పెరుగు, మజ్జిగ ప్రోబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియా)కి అద్భుతమైన వనరులు, ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో, పేగు ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.


మొలకలు

మొలకల్లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తింటే ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది.

ఆరోగ్యకరమైన స్నాక్స్ తినడం వల్ల బరువు నియంత్రణలో ఉండటంతో పాటు మొత్తం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా మధుమేహం, బీపీ, ఊబకాయం ఉన్నవారు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.

జాగ్రత్తలు

  • ప్యాకెట్ ఫుడ్స్ తగ్గించాలి.

  • రోజుకు 8–9 గ్లాసుల నీరు తాగాలి.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..

గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు

For More Latest News

Updated Date - Mar 26 , 2026 | 04:45 PM