వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు తీసుకెళ్లాల్సిన 5 ముఖ్య వస్తువులు
ABN , Publish Date - Mar 26 , 2026 | 01:56 PM
వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. డీహైడ్రేషన్ వంటి సమస్యలను నివారించడానికి కొన్ని నిత్యావసర వస్తువులను బ్యాగ్‌లో ఉంచుకోవాలి.
ఇంటర్నెట్ డెస్క్: వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే, అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్, వడదెబ్బ, అలసట, చర్మ సమస్యలు, ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల వేడి నుంచి రక్షణ పొందడానికి, ఆరోగ్యంగా ఉండటానికి, బయటకు వెళ్లేటప్పుడు కొన్ని నిత్యావసర వస్తువులను మీ బ్యాగ్‌లో ఉంచడం మంచిది.
వాటర్ బాటిల్
వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా వాటర్ బాటిల్ తీసుకెళ్లడం వల్ల డీహైడ్రేషన్ తగ్గుతుంది. ప్లాస్టిక్ బాటిల్స్‌కు బదులుగా స్టెయిన్‌లెస్ స్టీల్, రాగి లేదా గాజు బాటిల్‌ను ఉపయోగించడం మంచిది. ఎండలో ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీరు నిల్వ ఉంచడం వల్ల హానికరమైన రసాయనాలు నీటిలో కలిసి ప్రమాదకరంగా మారతాయి, కాబట్టి వాటిని నివారించాలి.
సన్‌గ్లాసెస్
ఎండ నుంచి కళ్లను కాపాడుకోవడానికి సన్‌గ్లాసెస్ చాలా అవసరం. సన్‌గ్లాసెస్ కేవలం స్టైల్ కోసం మాత్రమే కాకుండా, సూర్యరశ్మిలోని హానికరమైన UV కిరణాల నుంచి కళ్లను రక్షించడానికి, కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
సన్‌స్క్రీన్ క్రీమ్
సూర్యుని నుంచి వచ్చే హానికరమైన UVA/UVB కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడానికి సన్‌స్రీన్ క్రీమ్ ఉపయోగపడుతుంది. SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న బ్రాడ్-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను ప్రతిరోజూ ఉపయోగించడం చాలా ముఖ్యం. దీనిని బయటకు వెళ్లే 15-30 నిమిషాల ముందు రాసుకోవాలి. ఎండలోకి వెళ్లే ప్రతిసారీ, ముఖ్యంగా ప్రతి 2-3 గంటలకు ఒకసారి రాసుకోవాలి.
గొడుగు
ఎండలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది వడదెబ్బ, చర్మ సమస్యల నుంచి కాపాడుతుంది.
స్కార్ఫ్
వేసవిలో బయటకు వెళ్లినప్పుడు అమ్మాయిలు స్కార్ఫ్, అబ్బాయిలు టోపీ పెట్టుకోవడం చాలా మంచిది. ఇవి రక్షణ కవచంలా పనిచేస్తాయి. ముఖం, మెడ చర్మాన్ని రక్షిస్తాయి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..
గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు
For More Health News