Share News

చల్లటి నీరు ఆరోగ్యానికి హానికరమా?

ABN , Publish Date - Mar 25 , 2026 | 01:44 PM

వేసవిలో చల్లటి నీరు తాగడం వల్ల శరీరం తక్షణమే రిఫ్రెష్ అవుతుంది. వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే, చల్లటి నీరు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిదేనా?

చల్లటి నీరు ఆరోగ్యానికి హానికరమా?
Cold Water Side Effects

ఇంటర్నెట్ డెస్క్: వేసవిలో చల్లటి నీరు తాగడం వల్ల శరీరం తక్షణమే రిఫ్రెష్ అవుతుంది. వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే, వేసవిలో చల్లటి నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

నిపుణుల ప్రకారం, ఎక్కువగా చల్లటి నీరు తాగడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా శరీరం బాగా వేడిగా ఉన్నప్పుడు ఒక్కసారిగా చల్లటి నీరు తాగడం శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.


చల్లటి నీరు తాగడం వల్ల కలిగే సమస్యలు

  • చల్లటి నీరు జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. దీంతో ఆహారం సరిగా జీర్ణం కాకపోవచ్చు.

  • కడుపులో భారంగా అనిపించడం, గ్యాస్ సమస్యలు రావచ్చు.

  • గొంతులో గరగర అనిపించవచ్చు.

  • ఒక్కసారిగా చల్లటి నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో మార్పులు వచ్చి తలనొప్పి లేదా అలసట కలగవచ్చు.

  • రక్త ప్రసరణపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.

  • ఎక్కువగా చల్లటి నీరు తాగే అలవాటు దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.


వీళ్లు చల్లటి నీరు తాగకూడదు?

జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు, గొంతు లేదా సైనస్ సమస్యలు ఉన్నవారు, తరచుగా జలుబు సమస్యతో బాధపడేవారు, చిన్నపిల్లలు, వృద్ధులు, గుండె లేదా రక్తపోటు సమస్యలు ఉన్నవారు చల్లటి నీరు తాగకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎండలో నుంచి వచ్చిన వెంటనే నీరు తాగకుండా, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. కొద్దికొద్దిగా నీరు తాగడం మంచిది. గొంతు నొప్పి లేదా జలుబు ఉన్నప్పుడు చల్లటి నీరు తాగకూడదు. చల్లటి నీరు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి హానికరం కావచ్చు. కాబట్టి, శరీర పరిస్థితిని బట్టి మితంగా తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..

గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు

For More Health News

Updated Date - Mar 25 , 2026 | 02:47 PM