పచ్చి బఠాణి కూర.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్..
ABN , Publish Date - Feb 09 , 2026 | 12:55 PM
పచ్చి బఠాణి కూర రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉండే సింపుల్ వంటకం. ఇందులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో సులభంగా తయాకయ్యే పచ్చి బఠాణీ కూరను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: పచ్చి బఠాణీ కూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది అన్నం, చపాతీ, రోటీతో చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ఇంట్లో సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు
పచ్చి బఠాణి గింజలు – 1 కప్పు
ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)
టమాట – 1 (సన్నగా తరిగినది)
అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్
పచ్చిమిర్చి – 1 లేదా 2 (తరిగినవి)
కారం – ½ స్పూన్
ధనియాల పొడి – 1 స్పూన్
పసుపు – చిటికెడు
ఉప్పు – తగినంత
నూనె – 2 స్పూన్లు
జీలకర్ర – ½ స్పూన్
కొత్తిమీర – కొద్దిగా (తరిగినది)
నీరు – అవసరమైనంత
తయారీ విధానం..
ముందుగా బఠాణి గింజలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టండి.
ఒక కడాయిలో నూనె వేడి చేసి, జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి పచ్చి వాసన పోయే వరకు కలపాలి.
ఇప్పుడు టమాట ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి.
పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
పచ్చి బఠాణి గింజలు వేసి 2–3 నిమిషాలు కలపాలి.
కొద్దిగా నీరు పోసి మూత పెట్టి, బఠాణిలు మెత్తబడే వరకు ఉడికించాలి.
కూరకు కావాల్సినంత గ్రేవీ వచ్చాక గ్యాస్ ఆపేసి, కొత్తిమీర చల్లుకుని బాగా కలిపి స్టవ్ ఆపేయండి.
పచ్చి బఠాణి కూర ఆరోగ్య ప్రయోజనాలు..
జీర్ణక్రియకు మంచిది.
ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
షుగర్ ఉన్నవారికి కూడా పరిమితంగా తీసుకోవచ్చు.
శరీరానికి శక్తిని ఇస్తుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
మునగాకు సూప్ ఎలా చేయాలో తెలుసా?
మార్కెట్లో కల్తీ అల్లం.. కొనేముందు ఇది తెలుసుకోండి.!
For More Latest News