Share News

Egg Storage Tips: గుడ్డు చెడిపోయిందో లేదో ఎలా తెలుసుకోవాలి?

ABN , Publish Date - Jan 03 , 2026 | 02:48 PM

గుడ్లను ఎన్ని రోజులు ఫ్రిజ్‌లో ఉంచవచ్చు? గుడ్లను ఎలా నిల్వ చేయాలి? వాటిని ఎన్ని రోజులు ఫ్రిజ్‌లో ఉంచవచ్చు? వాటి నాణ్యతను ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Egg Storage Tips:   గుడ్డు చెడిపోయిందో లేదో ఎలా తెలుసుకోవాలి?
Egg Storage Tips

ఇంటర్నెట్ డెస్క్: కోడి గుడ్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో శరీరానికి వేడి ఇవ్వడానికి, శక్తిని పెంచడానికి చాలామంది గుడ్లను ఎక్కువగా తింటారు. కానీ గుడ్లను సరిగ్గా నిల్వ చేయకపోతే, అవి ఆరోగ్యానికి మేలు చేయడం కాకుండా హానికరంగా మారుతాయి. అయితే, గుడ్లను ఎలా నిల్వ చేయాలి? వాటిని ఎన్ని రోజులు ఫ్రిజ్‌లో ఉంచవచ్చు? వాటి నాణ్యతను ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..


గుడ్లు చెడిపోవడానికి ప్రధాన కారణం సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా గుడ్లలో వేగంగా పెరుగుతుంది. ఇలాంటి గుడ్లు తింటే ఫుడ్ పాయిజనింగ్, వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి సమస్యలు రావచ్చు.

గుడ్లను ఎంతకాలం నిల్వ చేయవచ్చు?

  • గుడ్లు ఎంతకాలం తాజాగా ఉంటాయో తెలుసుకోవాలంటే, వాటిని కొనుగోలు చేసిన తేదీ నుంచి లెక్కించాలి.

  • గుడ్లు (షెల్‌తో ఉన్నవి): ఫ్రిజ్‌లో 3 నుంచి 5 వారాల వరకు ఉంచవచ్చు

  • ఉడికించిన గుడ్లు (షెల్‌తో): ఫ్రిజ్‌లో 5 నుంచి 7 రోజులు

  • ఉడికించిన గుడ్లు (షెల్ తీసినవి): 2 నుంచి 3 రోజులు మాత్రమే


గుడ్లను ఎలా నిల్వ చేయాలి?

గుడ్లను ఫ్రిజ్‌లో ఒక కంటైనర్‌లో పెట్టి నిల్వ చేయడం మంచిది. చాలా మంది ఫ్రిజ్ తలుపులో గుడ్లు ఉంచుతారు, అయితే ఇది మంచిది కాదు. ఫ్రిజ్ తలుపు తరచూ తెరవడం, మూసివేయడం వల్ల ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది. గుడ్లను ఫ్రిజ్ లోపల, ఉష్ణోగ్రత స్థిరంగా ఉండే చోట ఉంచాలి. 4 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద గుడ్లను నిల్వ చేయడం ఉత్తమం.


గుడ్డు చెడిపోయిందో లేదో ఎలా తెలుసుకోవాలి?

  • ఫ్లోట్ టెస్ట్

ఒక గిన్నె నీటిలో గుడ్డు వేయండి. అది అడుగున మునిగితే గుడ్డు మంచిదని అర్థం. అది పైకి తేలితే.. గుడ్డు చెడిపోయిందని తెలుసుకోవాలి. ఇలాంటి గుడ్డును వెంటనే పారేయాలి.

  • వాసన ద్వారా తెలుసుకోవడం

గుడ్డు వండినప్పుడు లేదా పగలగొట్టినప్పుడు కుళ్ళిన వాసన వస్తే, అది తినడానికి పనికిరాదు.

  • ఫ్లాష్‌లైట్ టెస్ట్

మొబైల్ ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి గుడ్డు వెనుక పెట్టండి. లోపల పసుపు రంగు స్పష్టంగా కనిపిస్తే గుడ్డు తాజాగా ఉందని అర్థం. లోపల తెల్లగా లేదా మసకగా కనిపిస్తే గుడ్డు చెడిపోయిందని తెలుసుకోవాలి.


(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు )

Also Read:

ఈ సమస్యలు ఉన్నవారు బాదం తినకపోవడం మంచిది.!

చలికాలం.. ఎక్కువగా ఆకలి వేయడానికి కారణం ఇదే

For More Latest News

Updated Date - Jan 03 , 2026 | 02:48 PM