Almonds Side Effects: ఈ సమస్యలు ఉన్నవారు బాదం తినకపోవడం మంచిది.!
ABN , Publish Date - Jan 03 , 2026 | 02:10 PM
బాదం ఆరోగ్యానికి చాలా మంచిదని అంటారు. అయితే, ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తినకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఏ సమస్య ఉన్నవాళ్లు వీటిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: బాదం ఆరోగ్యానికి మంచిదని చాలామంది భావిస్తారు. ముఖ్యంగా శీతాకాలంలో బాదం తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. బాదంలో ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్-E వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపు ఆరోగ్యానికి, ఎముకలకు, జుట్టుకు ఉపయోగపడతాయని చెబుతారు. కానీ, బాదం అందరికీ సరిపోదు. ముఖ్యంగా ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బాదం తినకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
నిపుణుల ప్రకారం, మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు, జీర్ణ సమస్యలు ఉన్నవారు, అధిక రక్తపోటుకు మందులు వాడుతున్నవారు బాదం తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలగవచ్చు. చాలామందికి బాదం శరీరానికి వేడి ఇవ్వడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. కానీ, బాదం తిన్న తర్వాత కడుపు నొప్పి, గ్యాస్ లేదా మొటిమలు వస్తే వెంటనే జాగ్రత్త పడాలి.
ఎందుకు తినకూడదు?
కిడ్నీ సమస్యలు ఉన్నవారు బాదం తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బాదంలో ఫాస్ఫరస్, ఆక్సలేట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారికి బాదం తినడం వల్ల గ్యాస్, పొట్ట ఉబ్బరం, మలబద్ధకం రావచ్చు. అలాగే, బాదం అంటే అలెర్జీ ఉన్నవారు బాదం తింటే తీవ్రమైన అలెర్జీ సమస్యలు రావచ్చు.
తినకూడదు లేదా తగ్గించాలి?
బాదం తిన్న తర్వాత తలనొప్పి, చర్మంపై దద్దుర్లు, కడుపు నొప్పి వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కొన్ని యాంటీబయాటిక్ మందులు వాడుతున్నవారు కూడా బాదం తినకపోవడం మంచిది. ఆరోగ్య సమస్యలు లేని వారు కూడా బాదాన్ని మితంగా మాత్రమే తినాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు 4–5 బాదం తింటే చాలని చెబుతున్నారు. రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం తొక్క తీసి తినడం మరింత మంచిదని అంటున్నారు.
(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు )
Also Read:
చలికాలం.. ఎక్కువగా ఆకలి వేయడానికి కారణం ఇదే
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!
For More Latest News