Chicken Popcorn Recipe: క్రిస్పీ అండ్ టేస్టీ చికెన్ పాప్‌కార్న్.. ఇంట్లోనే ఎలా చేయాలో తెలుసా?
ABN , Publish Date - Jan 19 , 2026 | 05:32 PM
క్రిస్పీ అండ్ టేస్టీ చికెన్ పాప్‌కార్న్‌ను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. అయితే, దీన్ని ఎలా చేస్తారో మీకు తెలుసా?. దీన్ని ఇంట్లో తయారు చేసుకోవడం చాలా సులభం. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో దొరికే క్రిస్పీ చికెన్ పాప్‌కార్న్ చాలా మందికి ఇష్టమైన స్నాక్. కానీ అదే రుచి, అదే క్రిస్పీనెస్‌తో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. పిల్లలు నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే ఈ చికెన్ పాప్‌కార్న్ రెసిపీని ఇప్పుడు తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు
ఎముకలు లేని చికెన్ – 250 గ్రాములు (చిన్న ముక్కలుగా కట్ చేయాలి)
మైదా – 3 టేబుల్ స్పూన్లు
గుడ్లు - రెండు
కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్లు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
కారం – 1 టీస్పూన్
మిరియాల పొడి – ½ టీస్పూన్
గరం మసాలా – ½ టీస్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – వేయించడానికి కావలసినంత
చికెన్ మరినేషన్ విధానం
ముందుగా చికెన్ ముక్కలను 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీరు వడగట్టాలి. ఒక గిన్నెలో చికెన్ ముక్కలు వేసి అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, మిరియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు మైదా, కార్న్ ఫ్లోర్, గుడ్డు వేసి మరోసారి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కనీసం 20–30 నిమిషాలు పక్కన పెట్టి మరినేట్ చేయాలి.
వేయించే విధానం
కడాయిలో నూనె వేడి చేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత, మరినేట్ చేసిన చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా నూనెలో వేసి మీడియం మంటతో వేయించాలి. అలా చికెన్ ముక్కలు బంగారు రంగులోకి వచ్చి క్రిస్పీగా అయ్యేవరకు వేయించాలి. తర్వాత వేయించిన చికెన్‌ను టిష్యూ పేపర్ మీద పెట్టి అదనపు నూనె తీసేయాలి.
సర్వ్ చేసే విధానం
ఈ క్రిస్పీ చికెన్ పాప్‌కార్న్‌ను టమాటో సాస్, మయోనీజ్ లేదా గార్లిక్ డిప్‌తో వేడిగా సర్వ్ చేయండి. టీ టైమ్ స్నాక్‌గా లేదా పార్టీ స్టార్టర్‌గా ఇది చాలా బాగుంటుంది. బయట ఫాస్ట్ ఫుడ్ తినాలనే కోరిక వచ్చినప్పుడు, ఇంట్లోనే సులభంగా ఈ క్రిస్పీ అండ్ టేస్టీ చికెన్ పాప్‌కార్న్ తయారు చేసుకోవచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News