Share News

మార్కెట్‌లో పాడైపోయిన సొరకాయలను ఇలా గుర్తించండి

ABN , Publish Date - Apr 13 , 2026 | 01:42 PM

వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలలో సొరకాయ ఒకటి. అయితే మార్కెట్‌లో లభించే ప్రతి సొరకాయ తాజాగా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు పాడైపోయిన సొరకాయలను కూడా విక్రయిస్తారు, ఇవి ఆరోగ్యానికి హానికరం.

మార్కెట్‌లో పాడైపోయిన సొరకాయలను ఇలా గుర్తించండి
Bottle Gourd Freshness Tips

ఇంటర్నెట్ డెస్క్: వేసవిలో ఎక్కువగా లభించే కూరగాయలలో సొరకాయ ఒకటి. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని చల్లగా ఉంచి, డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. అలాగే జీర్ణక్రియకు కూడా ఇది చాలా మంచిది. సొరకాయలో పీచు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. తక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది మంచి ఎంపిక. కాబట్టి దీన్ని ఆహారంలో చేర్చుకోవడం మంచిదే, కానీ కొనుగోలు సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఎందుకంటే, కొన్నిసార్లు పాడైపోయిన సొరకాయలను కూడా విక్రయిస్తారు.. ఇవి ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు.


సొరకాయ రంగు గమనించండి

తాజా సొరకాయ సాధారణంగా లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దాని పై తొక్క మృదువుగా, ఎలాంటి మచ్చలు లేకుండా ఉంటుంది. ఒకవేళ సొరకాయ ముదురు రంగులో కనిపిస్తే, నల్లటి మచ్చలు ఉన్నా లేదా తొక్కపై ముడతలు పడినట్లయితే, అది పాడైపోయిందని అర్థం. అలాంటి సొరకాయలను కొనకుండా ఉండటం మంచిది.

గోరుతో నొక్కి చూడండి

గోరుతో సొరకాయను కొద్దిగా నొక్కి చూడండి, సులభంగా లోపలికి వెళ్తే అది లేతగా, తాజాగా ఉన్నట్లు అర్థం. గట్టిగా ఉంటే అది ముదిరినది. అలాంటి సొరకాయలలో లోపల గింజలు ఎక్కువగా ఉండి, రుచి కూడా తక్కువగా ఉంటుంది.

పరిమాణం గమనించండి

చాలా పెద్దగా లేదా మందంగా ఉన్న సొరకాయలు సాధారణంగా ఎక్కువగా పండిపోయి ఉంటాయి. ఇవి రుచిగా ఉండవు, గింజలు ఎక్కువగా ఉంటాయి. సొరకాయ అసాధారణంగా పెద్దగా లేదా చాలా మెరుస్తూ కనిపిస్తే కొనకుండా ఉండటం మంచిది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

పక్షుల గుంపులు 'వి' ఆకారంలోనే ఎందుకు ఎగురుతాయి.. దీని వెనుక కారణమేంటి?

ప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతిపై సీఎం రేవంత్‌ దిగ్భ్రాంతి

For More Latest News

Updated Date - Apr 13 , 2026 | 02:51 PM