డార్క్ లిప్‌స్టిక్‌ను సులభంగా తొలగించే బెస్ట్ టిప్స్ ఇవే..
ABN , Publish Date - Feb 21 , 2026 | 06:09 PM
డార్క్ లిప్‌స్టిక్‌ను తొలగించడం చాలా మందికి కష్టంగా అనిపిస్తుంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలను పాటిస్తే పెదవులకు హాని కలగకుండా లిప్‌స్టిక్‌ను సులభంగా తొలగించవచ్చు..
ఇంటర్నెట్ డెస్క్: లిప్‌స్టిక్ ముఖానికి అందాన్ని పెంచి, లుక్‌కు పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇస్తుంది. సరైన లిప్‌స్టిక్ షేడ్ ఎంచుకోవడం ద్వారా ముఖ సౌందర్యం మరింత పెరుగుతుంది. ఇది ముఖానికి తక్షణ ఆకర్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అయితే, డార్క్ లిప్‌స్టిక్‌ను తొలగించడం కొన్నిసార్లు కష్టంగా మారుతుంది. సరైన విధంగా తొలగించకపోతే పెదవులు పొడిబారటం లేదా నల్లబడటం వంటి సమస్యలు రావొచ్చు. కాబట్టి లిప్‌స్టిక్‌ను సురక్షితంగా, సులభంగా తొలగించే కొన్ని చిట్కాలు తెలుసుకోవడం మంచిది.
మైసెల్లార్ వాటర్..
లిప్‌స్టిక్ తొలగించడంలో మైసెల్లార్ వాటర్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒక కాటన్ ప్యాడ్‌పై కొద్దిగా మైసెల్లార్ వాటర్ వేసి, పెదవులపై నెమ్మదిగా తుడవాలి. దీంతో లిప్‌స్టిక్ సులభంగా తొలగిపోతుంది.
ఆయిల్ బేస్డ్ మేకప్ రిమూవర్..
మొండి లిప్‌స్టిక్‌ను తొలగించడంలో ఆయిల్ ఆధారిత మేకప్ రిమూవర్ చాలా సహాయపడుతుంది. కాటన్ ప్యాడ్‌పై రిమూవర్ వేసి పెదవులపై నెమ్మదిగా రుద్దండి. కొద్దిసేపటికి లిప్‌స్టిక్ సులభంగా తొలగిపోతుంది.
రోజ్ వాటర్..
రోజ్ వాటర్ కూడా సహజమైన క్లీనర్‌లా పనిచేస్తుంది. కాటన్ బాల్‌పై కొద్దిగా రోజ్ వాటర్ వేసి, పెదవులపై మెల్లగా తుడవండి. ఇది పెదవులను శుభ్రం చేయడంతో పాటు తాజాగా ఉంచుతుంది.
కొబ్బరి నూనె..
కొబ్బరి నూనె సహజమైన మేకప్ రిమూవర్‌గా పని చేస్తుంది. కొద్దిగా కొబ్బరి నూనెను పెదవులపై రాసి.. మెల్లగా మసాజ్ చేయండి. తరువాత టిష్యూ లేదా కాటన్‌తో తుడవండి. దీంతో లిప్‌స్టిక్ సులభంగా తొలగిపోతుంది.
చివరగా చేయాల్సిన పని..
లిప్‌స్టిక్ తొలగించిన తరువాత పెదవులను శుభ్రమైన నీటితో కడగాలి. తరువాత మృదువైన గుడ్డతో తుడవాలి. చివరగా లిప్ బామ్ రాసుకుంటే పెదవులు మృదువుగా, ఆరోగ్యంగా ఉంటాయి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
యువతలో బీపీ పెరగడానికి కారణం తెలుసా?
పాదాలలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!
For More Latest News