Share News

చాణక్య నీతి.. కష్టాలు వచ్చే ముందు.. ఈ సంకేతాలు మిమ్మల్ని హెచ్చరిస్తాయి.!

ABN , Publish Date - Feb 21 , 2026 | 05:09 PM

జీవితంలో కష్టాలు అకస్మాత్తుగా రావు, వాటికి ముందే కొన్ని సంకేతాలు కనిపిస్తాయని చాణక్య నీతి చెబుతోంది. ఇంట్లో జరిగే కొన్ని మార్పులు, సంఘటనలు రాబోయే ఆర్థిక లేదా కుటుంబ సమస్యలకు హెచ్చరికలుగా ఉండొచ్చని ఆచార్య చాణక్యుడు సూచించారు..

చాణక్య నీతి.. కష్టాలు వచ్చే ముందు.. ఈ సంకేతాలు మిమ్మల్ని హెచ్చరిస్తాయి.!
Chanakya Niti Warning Signs

ఇంటర్నెట్ డెస్క్: చాణక్య నీతి ప్రకారం, మన జీవితంలో పెద్ద సమస్యలు లేదా కష్టాలు వచ్చే ముందే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఈ సంకేతాలను ముందుగానే గుర్తిస్తే.. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు లేదా ఇతర ఇబ్బందుల నుంచి జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాణక్య నీతి ప్రకారం ఇంట్లో కనిపించే ముఖ్యమైన హెచ్చరిక సంకేతాలు ఏంటో తెలుసుకుందాం..


తులసి మొక్క ఎండిపోవడం..

తులసి మొక్కను హిందూ సంప్రదాయంలో పవిత్రంగా భావిస్తారు. ఇంట్లో ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సుకు ఇది ప్రతీకగా ఉంటుంది. చాణక్యుడి ప్రకారం.. ఇంట్లో బాగా పెరిగిన తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోతే, అది ఆర్థిక సమస్యలు లేదా ప్రతికూల పరిస్థితులు రాబోతున్నాయనడానికి సూచిక.

ఇంట్లో తరచూ గొడవలు..

చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరగడం కూడా మంచిది కాదని చాణక్యుడు చెప్పారు. ఎప్పుడూ అశాంతి, వాదనలు ఉండే ఇంట్లో సంతోషం తగ్గిపోతుంది. ఇది మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలకు సంకేతంగా పరిగణిస్తారు.


గాజు వస్తువులు పదే పదే పగిలిపోవడం..

ఇంట్లో గాజు గ్లాసులు, అద్దాలు లేదా ఇతర గాజు వస్తువులు తరచూ పగిలిపోవడం అశుభంగా భావిస్తారు. చాణక్య నీతి ప్రకారం.. ఇది రాబోయే కష్టాలు లేదా ఆరోగ్య సమస్యలకు హెచ్చరిక కావొచ్చు. ఇది ఇంట్లో ప్రతికూల వాతావరణం పెరుగుతోందని సూచిస్తుంది.

పూజ పట్ల ఆసక్తి తగ్గిపోవడం..

కుటుంబ సభ్యులు అకస్మాత్తుగా దేవుడిపై భక్తి తగ్గించడం లేదా పూజ చేయడం మానేయడం కూడా మంచిది కాదని చాణక్యుడు చెప్పారు. ఇది మనసు అస్థిరంగా మారేందుకు దారి తీస్తుందని.. ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తి తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.


పెద్దలను అగౌరవపరచడం..

పెద్దలను గౌరవించడం భారతీయ సంస్కృతి. కానీ ఇంట్లో పెద్దలను అగౌరవపరచడం లేదా అవమానించడం ప్రారంభమైతే.. అది కుటుంబానికి కష్టాలు వచ్చే సంకేతంగా చాణక్యుడు పేర్కొన్నారు. పెద్దల ఆశీర్వాదం లేకపోతే శాంతి, శ్రేయస్సు తగ్గిపోతాయని ఆయన చెప్పారు.

చాణక్య నీతి ప్రకారం, ఈ సంకేతాలు జీవితంలో రాబోయే కష్టాలకు ముందస్తు హెచ్చరికలు. ఇవి సంప్రదాయ విశ్వాసాలపై ఆధారపడినప్పటికీ కుటుంబంలో శాంతి, పరస్పర గౌరవం, సానుకూల వాతావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. జాగ్రత్తగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకుంటే అనేక సమస్యలను ముందుగానే నివారించవచ్చు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

యువతలో బీపీ పెరగడానికి కారణం తెలుసా?

పాదాలలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!

For More Latest News

Updated Date - Feb 21 , 2026 | 05:47 PM