Share News

గ్యాస్ స్టవ్ బర్నర్‌ను సులభంగా శుభ్రం చేసే చిట్కాలివే..

ABN , Publish Date - Feb 21 , 2026 | 02:16 PM

గ్యాస్ స్టవ్ బర్నర్ మురికిగా ఉంటే మంట సరిగా రాదు. దీనివల్ల వంట చేయడం కష్టంగా మారుతుంది. అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో గ్యాస్ స్టవ్ బర్నర్‌ను త్వరగా, సమర్థవంతంగా శుభ్రం చేసుకోవచ్చు..

గ్యాస్ స్టవ్ బర్నర్‌ను సులభంగా శుభ్రం చేసే చిట్కాలివే..
Gas Stove Burner Cleaning Tips

ఇంటర్నెట్ డెస్క్: గ్యాస్ స్టవ్ బర్నర్‌పై పాలు, నూనె, కూరలు వంటి పదార్థాల మరకలు పడటం సహజం. ఎంత క్లీన్ చేసినా కూడా కొన్ని మరకలు అలానే ఉంటాయి. చాలా మంది స్టవ్‌పై భాగాన్ని శుభ్రం చేస్తారు కానీ.. బర్నర్‌ను మాత్రం పట్టించుకోరు. బర్నర్‌ను శుభ్రం చేయకపోతే గ్యాస్ మంట సరిగా రాదు. అందుకే బర్నర్‌ను కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేయడం అవసరం.


బేకింగ్ సోడా, నిమ్మరసం..

ఒక గిన్నెలో గోరువెచ్చని నీరు తీసుకుని, అందులో 2–3 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా వేసి, ఒక నిమ్మకాయ రసం పిండాలి. బర్నర్‌ను నీటిలో 30 నిమిషాల నుంచి ఒక గంట వరకు నానబెట్టాలి. తరువాత పాత టూత్ బ్రష్ లేదా స్క్రబ్బర్‌తో రుద్దితే మురికి సులభంగా తొలిగిపోతుంది.

వెనిగర్..

వెనిగర్, నీటిని సమాన మోతాదులో కలిపి స్ప్రే బాటిల్‌లో పోయాలి. ఈ ద్రావణాన్ని బర్నర్‌పై స్ప్రే చేసి 15–20 నిమిషాలు ఉంచాలి. తర్వాత స్క్రబ్బర్‌తో రుద్దితే మరకలు తొలగిపోతాయి.


డిష్ వాషింగ్ సబ్బు, గోరువెచ్చని నీరు..

గోరువెచ్చని నీటిలో కొద్దిగా డిష్ వాషింగ్ సబ్బు కలిపి బర్నర్‌ను 30 నిమిషాలు నానబెట్టాలి. తరువాత స్క్రబ్బర్‌తో శుభ్రం చేస్తే బర్నర్ మెరిసిపోతుంది.

వెనిగర్, బేకింగ్ సోడా..

బాగా పేరుకుపోయిన మురికి ఉంటే.. నీరు, వెనిగర్‌ను సమానంగా కలిపి బర్నర్‌ను కనీసం 2–3 గంటలు లేదా రాత్రంతా నానబెట్టాలి. తర్వాత బేకింగ్ సోడా చల్లి టూత్ బ్రష్‌తో రుద్దితే కఠినమైన మరకలు కూడా పోతాయి.


నిమ్మకాయ, ఉప్పు..

బర్నర్‌ ఎక్కువగా మురికిగా ఉంటే.. నిమ్మకాయను సగం కోసి దానిపై ఉప్పు చల్లి బర్నర్‌పై రుద్దాలి. ఇలా చేస్తే మురికి తొలగి బర్నర్ కొత్తలా మెరుస్తుంది. ఈ చిట్కాలను పాటిస్తే గ్యాస్ స్టవ్ బర్నర్‌ను సులభంగా శుభ్రంగా ఉంచుకోవచ్చు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

యువతలో బీపీ పెరగడానికి కారణం తెలుసా?

పాదాలలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!

For More Latest News

Updated Date - Feb 21 , 2026 | 03:06 PM