జీవితంలో విజయం సాధించాలనుకుంటున్నారా.. చాణక్యుడి సలహాలివే
ABN , Publish Date - Oct 25 , 2026 | 07:51 AM
జీవితంలో విజయం సాధించాలని కోరుకోని వారు ఎవరూ ఉండరు. కానీ అది అందరికి సాధ్యం కాదు. కొంతమంది సునాయాసంగా విజయతీరాలను చేరితే.. మరికొంతమంది ఏళ్ల తరబడి పోరాటం చేస్తుంటారు. మరి వాళ్లు చేసిన తప్పులేంటో.. వాటిని అధిగమించడానికి చాణక్యుడు చెప్పిన సలహాలేంటో తెలుసుకుందామా..
ఇంటర్నెట్ డెస్క్: జీవితంలో విజయం సాధించలేని వాడిని ప్రపంచం అసమర్థుడిలా చూస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ జీవితంలో సక్సెస్ అవ్వాలని ఆరాటపడుతుంటారు. చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు. కానీ ఎంతకష్టపడ్డా సరే.. విజయాన్ని సాధించడంలో విఫలమవుతుంటారు. అటువంటి వారి కోసమే చాణక్యుడు కొన్ని సూత్రాలు చెప్పారు. అవేంటో సూసేద్దాం.
ప్రణాళికతో పాటు ఆచరణ ముఖ్యం
అది చేయాలి. ఇది చేయాలి. అలా ఉండాలి. ఇలా ఉండాలి అని ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాం. కానీ అమలు చేయాల్సి వచ్చినప్పుడు సాకులు వెతుకుతుంటాం. మన తప్పులను ఒప్పుకోకుండా పరిస్థితులను నిందిస్తుంటాం. అలా కాకుండా.. ఎప్పటికప్పుడు సరైన నిర్ణయాలను తీసుకోవడం ద్వారా.. కార్యాచరణకు అవరోధం కలిగించే ఆలోచనలను మన మనసులోకి రాకుండా జాగ్రత్త పడవచ్చు.
సమయం విలువను తెలుసుకోవాలి
జీవితంలో అత్యంత విలువైనది సమయం. సమయాన్ని ఒక్కసారి ఖర్చు చేస్తే తిరిగి పొందలేము. సమయం విలువ తెలుసుకుని దానిని ఉపయోగించుకోవాలి. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టకున్నట్లు.. సమయాన్ని వృథా చేసిన తరువాత ఏడ్చి గగ్గోలు పెట్టడంలో ఎటువంటి ప్రయోజనం లేదు.
మీ లక్ష్యాలను ఎవరికీ ముందే చెప్పొద్దు
ఒక వ్యక్తి తాను చేరదలచుకున్న గమ్యం గురించి ఎవరికి చెప్పొద్దు. తన ప్రణాళికను ఎవరితో పంచుకోవద్దు. ఎందుకంటే.. ఇతరులతో పంచుకోవడం ద్వారా.. వారు అనవసర సలహాలు ఇస్తుంటారు, విమర్శలు చేస్తుంటారు, ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తారు. దాంతో మీ ఏకాగ్రతకు భంగం కలగడం మాత్రమే కాకుండా మీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. అందుకే ఒక పని తలపెట్టినప్పుడు ఆ పని అయ్యేంత వరకు ఎవరికి చెప్పకూడదు.
అనవసర ఖర్చులను తగ్గించుకోండి
ధనం మూలం ఇధం జగత్ అన్నారు చాణక్యుడు. ప్రపంచాన్ని నడిపించేది ధనమే. అటువంటి ధనాన్ని సంపాదించడమే కాదు కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. అనవసర ఖర్చులు చేయకుండా.. ఆదా చేస్తూ.. సరైన చోట ఉపయోగిస్తే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు.
ఈ వార్తలూ చదవండి
నెలల తరబడి గొయ్యిలోనే.. ప్రాణాల కోసం భయంకర పోరాటం.. చివరికి..
కలుపు మొక్కలు తినేందుకు మేకలకు ఉద్యోగం.. జపాన్‌లో వినూత్న ప్రయోగం! వీడియో వైరల్