ఇంట్లో ఇలాంటి వారు ఉంటే సంతోషం దూరమవుతుంది!
ABN , Publish Date - Mar 31 , 2026 | 11:01 AM
ఇంట్లో శాంతి, సంతోషం నిలవాలంటే కుటుంబ సభ్యుల ప్రవర్తన ఎంతో ముఖ్యమని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించారు. ఇంట్లో ఇలాంటి వారు ఉంటే సంతోషం దూరమవుతుందని హెచ్చరించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంట్లో శాంతి, సంతోషం ఉండాలంటే కుటుంబ సభ్యుల ప్రవర్తన ఎంతో ముఖ్యమని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించారు. కొన్ని రకాల వ్యక్తులు తెలియకుండానే కుటుంబంలో కలహాలు, ఉద్రిక్తతలకు కారణమవుతారని ఆయన హెచ్చరించారు. మరి ఇంట్లో సంతోషాన్ని చెడగొట్టే వ్యక్తులు ఎవరు, వారి ప్రవర్తన కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం..
ఆవేశపడేవారు
చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకొనేవారు ఇంటి వాతావరణాన్ని చెడగొడతారు. ఎప్పుడూ అరవడం, తమ మాటే వినాలని ఒత్తిడి చేయడం వల్ల ఇంట్లో భయం, ఉద్రిక్తత పెరుగుతుంది. ఇంట్లో శాంతి, ఆనందం దూరమవుతాయి.
ప్రతికూలంగా మాట్లాడేవారు
ఇతరుల మాటలను వక్రీకరించి, పుకార్లు పుట్టించే వారు కుటుంబంలో విభేదాలకు కారణమవుతారు. అలాంటి వారి వల్ల అపార్థాలు పెరిగి, నమ్మకం తగ్గిపోతుంది. నమ్మకం లేకపోతే సంబంధాలు బలహీనపడతాయి.
స్వార్థపరులు
కేవలం 'నేను, నా అవసరాలు' అనే ధోరణితో వ్యవహరించేవారు కుటుంబంలోని ఇతర సభ్యుల భావోద్వేగాలను, అవసరాలను విస్మరిస్తుంటారు. ఇలాంటివారి కారణంగా కుటుంబంలో ప్రశాంతత దెబ్బతింటుంది.
సోమరితనం
కుటుంబంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలి. కానీ కొందరు తమ పనులను నిర్లక్ష్యం చేస్తూ, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారు. అలాంటి వారు కుటుంబానికి భారంగా మారి, తరచూ గొడవలకు కారణమవుతారు.
చాణక్యుడి ప్రకారం.. కుటుంబంలో శాంతి, సంతోషం నిలవాలంటే మంచి ఆలోచనలు, పరస్పర గౌరవం అవసరం. ఇలాంటి ప్రతికూల లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, వాటిని మార్చడానికి ప్రయత్నిస్తేనే ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..
గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు
For More Latest News