Share News

మైగ్రేన్‌ను ఎలా కంట్రోల్ చేయాలి?

ABN , Publish Date - Mar 30 , 2026 | 02:08 PM

మహిళల్లో మైగ్రేన్ సమస్య రోజురోజుకీ పెరుగుతోంది. సాధారణ తలనొప్పి కంటే భిన్నంగా ఉండే ఈ నొప్పి, దైనందిన జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మైగ్రేన్‌కు గల కారణాలు, లక్షణాలు, నివారణ మార్గాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మైగ్రేన్‌ను ఎలా కంట్రోల్ చేయాలి?
Migraine in Women Causes

ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో చాలా మంది మహిళలు మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నారు. ఇది సాధారణ తలనొప్పి కంటే భిన్నంగా ఉంటుంది. ఎక్కువగా తల ఒక వైపు తీవ్రంగా కొట్టుకుంటున్నట్టు నొప్పి ఉంటుంది. కొందరికి వాంతులు, వికారం, కాంతి, శబ్దం వల్ల ఇబ్బంది కూడా కలుగుతుంది.


మైగ్రేన్‌కు ప్రధాన కారణాలు

మహిళల్లో మైగ్రేన్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా..

  • హార్మోన్ల మార్పులు: రుతుస్రావం, గర్భధారణ, మెనోపాజ్ సమయంలో మైగ్రేన్ ఎక్కువగా వస్తుంది.

  • ఒత్తిడి : మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటే తలనొప్పి పెరుగుతుంది.

  • నిద్రలేమి: నిద్రపట్టకపోవడం, త్వరగా మెలకువ రావడం లేదా తక్కువ సమయం నిద్రపోవడం.

  • స్క్రీన్ ఎక్కువగా చూడటం: మొబైల్, కంప్యూటర్ ఎక్కువగా వాడటం.

  • కాంతి, శబ్దం: ప్రకాశవంతమైన లైట్లు, పెద్ద శబ్దాలు

  • ఆహార అలవాట్లు: జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం.


మైగ్రేన్ తగ్గించుకోవడానికి సూచనలు

  • సమయానికి నిద్రపోవడంతో పాటు కనీసం 7–8 గంటలు నిద్రపోవాలి.

  • ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం చేయాలి.

  • స్క్రీన్ టైమ్ తగ్గించాలి.

  • క్రమం తప్పకుండా తినాలి.

  • ఎక్కువగా నీరు తాగాలి.

  • తేలికపాటి వ్యాయామం చేయాలి.

జాగ్రత్త

మైగ్రేన్ తరచుగా వస్తుంటే నిర్లక్ష్యం చేయకండి. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కారణాలను గుర్తించి వాటిని తగ్గించడానికి ప్రయత్నించాలి.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..

గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు

For More Health News

Updated Date - Mar 30 , 2026 | 03:38 PM