ఇల్లు ఇలా తుడిస్తే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందట
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:33 PM
ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం కేవలం పరిశుభ్రత కోసమే కాదు, ఇంట్లో సానుకూల శక్తిని నిలుపుకోవడానికి కూడా చాలా ముఖ్యం. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇల్లు తుడిచే సమయం, పద్ధతి, తుడిచేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన వాస్తు నియమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: మన జీవితంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. వాస్తు నియమాలను పాటిస్తే ఇంట్లో సంతోషం, శాంతి, శ్రేయస్సు పెరుగుతాయని చెబుతారు. ముఖ్యంగా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఇది కేవలం పరిశుభ్రత కోసమే కాకుండా, ఇంట్లో సానుకూల శక్తి నిలిచేలా చేస్తుంది. ఇల్లు తుడిచే సమయం, పద్ధతి కూడా వాస్తు ప్రకారం చాలా ముఖ్యం. అవి సరిగా పాటిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
ఎప్పుడు తుడవాలి?
వాస్తు ప్రకారం, ఉదయం సమయం ఇల్లు తుడవడానికి ఉత్తమం. సూర్యోదయం తర్వాత నుంచి మధ్యాహ్నం వరకు తుడవడం మంచిది. ఈ సమయంలో తుడిస్తే ఇంట్లో తాజాదనం వస్తుంది, నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తుడవడం మంచిది కాదు. అలా చేస్తే ఇంటి శ్రేయస్సుపై ప్రభావం పడుతుందని వాస్తు నిపుణులు చెబుతారు.
ఎలా తుడవాలి?
ఇల్లును ఎప్పుడూ లోపలి నుంచి బయటికి తుడవాలి. అంటే గదుల నుంచి ప్రారంభించి ప్రధాన ద్వారం వరకు తుడవాలి. ఇలా చేస్తే చెడు శక్తి బయటకు వెళ్లిపోతుందని నమ్మకం. తుడిచే నీటిలో కొద్దిగా ఉప్పు కలిపితే ఇంకా మంచిదని అంటారు. ఇది ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతారు. ఈ చిన్న వాస్తు నియమాలు పాటిస్తే ఇంట్లో శాంతి, సంతోషం పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..
గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు
For More Latest News