Share News

డొనాల్డ్ ట్రంప్ మాస్టర్ ప్లాన్.. ఇరాన్‌లోని యురేనియమే టార్గెట్..

ABN , Publish Date - Mar 30 , 2026 | 11:56 AM

ట్రంప్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ఇకపై న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయకుండా ఉండేలా మాస్టర్ ప్లాన్‌లు వేస్తున్నారు. న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయడానికి ఇరాన్ సిద్ధం చేసిపెట్టుకున్న 400 కేజీల యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు.

డొనాల్డ్ ట్రంప్ మాస్టర్ ప్లాన్.. ఇరాన్‌లోని యురేనియమే టార్గెట్..
Iran war latest news

ఇంటర్‌నెట్ డెస్క్: ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం 31వ రోజుకు చేరుకుంది. ప్రజల వ్యతిరేకత, రాజకీయ ఒత్తిళ్లు, ఆర్థిక నష్టాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం నుంచి వెనక్కు తగ్గారు. ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధం అయ్యారు. అయితే, అమెరికాతో చర్చలు జరిపేందుకు ఇరాన్ సుముఖత వ్యక్తం చేయటం లేదు. ఈ మేరకు ఇరాన్ నాయకులు పబ్లిక్‌గానే స్టేట్‌మెంట్‌లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ఇకపై న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయకుండా ఉండేలా మాస్టర్ ప్లాన్‌లు వేస్తున్నారు.


న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయడానికి ఇరాన్ సిద్ధం చేసిపెట్టుకున్న దాదాపు 970 పౌండ్ల(400కేజీలు) యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. ఇరాన్ దగ్గర 60 శాతం హైలీ ఎన్‌రిచ్డ్ యురేనియం 400 కేజీలు ఉంది. 20 శాతం ఫిస్సైల్ మెటీరియల్ 200 కేజీలు ఉంది. 60 శాతం హైలీ ఎన్‌రిచ్డ్ యురేనియంను ట్రంప్ టార్గెట్ చేశారు. అమెరికాకు చెందిన ఓ ప్రముఖ మీడియా కథనం ప్రకారం.. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ మెటీరియల్ ఉండకూడదని ట్రంప్ భావిస్తున్నారు. ఇరాన్‌తో చర్చలు జరిపి యురేనియాన్ని తీసుకోవాలని చూస్తున్నారు.


ఇరాన్ తమ ప్రతిపాదనకు అంగీకరించకపోతే.. బలవంతంగానైనా యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ చూస్తున్నారు. అమెరికా దళాల సాయంతో ఇరాన్ న్యూక్లియర్ సైట్లలోని యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్, అమెరికా దేశాల మధ్య రాజీ కుదుర్చేందుకు పాకిస్థాన్ చర్చలు జరుపుతోంది. ఆ చర్చలు ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని ట్రంప్ భావిస్తున్నారు. పాకిస్థాన్, ఈజిప్ట్, తుర్కియే దేశాలు ఇరాన్, అమెరికాల మధ్య రాజీకి ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నాయి. రాజీ చర్చలు ఫలితాలను ఇవ్వకపోతే ట్రంప్ తన ప్లాన్‌ను అమలు చేసే అవకాశం ఉంది.


మాజీ సైనికాధికారుల హెచ్చరిక

ఇరాన్ దగ్గర ఉన్న యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలన్న ట్రంప్ ఆలోచన ప్రమాదకరమైనదని అమెరికాకు చెందిన మాజీ సైనికాధికారులు అంటున్నారు. ఒకవేళ అమెరికా యురేనియాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళితే ఇరాన్ నుంచి మరింత ఉధృతంగా దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ట్రంప్ చర్యల వల్ల యుద్ధం మరిన్ని రోజులు కొనసాగుతుందే తప్ప ఆగదని స్పష్టం చేస్తున్నారు. ట్రంప్ ప్లాన్ చాలా రిస్క్‌తో కూడుకున్నదని, దానికి రోజులు, వారాల సమయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.


ఇవి కూడా చదవండి

తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల సస్పెన్షన్

అంతా కోల్పోయినప్పుడు ఏం చేయాలో తెలుసా?

Updated Date - Mar 30 , 2026 | 12:05 PM