ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవడం లేదా? ఈ తప్పులే కారణం..
ABN , Publish Date - Mar 06 , 2026 | 01:10 PM
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో డబ్బు చేతిలో నిలవకపోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలను వివరించారు. ఆ కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి కష్టపడుతుంటారు. మంచి జీవితం గడపాలని, ధనవంతులు కావాలని పగలు రాత్రి శ్రమిస్తారు. అయినా కూడా చాలా మందికి చేతిలో డబ్బు నిలవదు. సంపాదించిన డబ్బు ఏదో ఒక విధంగా ఖర్చైపోతూ ఉంటుంది. దీనికి కారణం కొన్ని తప్పులేనని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించారు. ఆ తప్పులను సరిచేసుకుంటే డబ్బు నిల్వ ఉండే అవకాశం పెరుగుతుందని ఆయన సూచించారు. మరి ఆ తప్పులు ఏంటో చూద్దాం..
పొదుపు చేయకపోవడం:
చాలా మంది డబ్బు సంపాదించిన వెంటనే ఖర్చు చేస్తారు. అవసరం లేని వాటిపై కూడా డబ్బు ఖర్చు చేస్తారు. దీంతో అవసరమైన సమయంలో చేతిలో డబ్బు ఉండదు. అందుకే సంపాదనలో కొంత భాగాన్ని తప్పనిసరిగా పొదుపు చేయాలి.
దానధర్మాలు చేయకపోవడం:
చాణక్య నీతి ప్రకారం, దానధర్మాలు చేసే వారిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. దానధర్మాలు చేయని వారు చాలా సార్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారని చాణక్యుడు చెప్పారు.
ఇంట్లో ప్రతికూల వాతావరణం:
ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో శాంతి లేకపోతే, అది వృధా. కుటుంబంలో ఆనందం, సఖ్యత లేకపోతే సంపద కూడా నిలవదని చాణక్యుడు వివరించారు.
ప్రదర్శన కోసం ఖర్చు చేయడం:
కొంతమంది ఇతరులకు గొప్పగా కనిపించేందుకు అవసరం లేని ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇలా కేవలం ప్రదర్శన కోసం జీవించే వారు తమ సంపదను త్వరగా కోల్పోతారని చాణక్యుడు హెచ్చరించారు.
డబ్బును గౌరవించకపోవడం:
కొంతమంది డబ్బును గౌరవించరు. నిర్లక్ష్యంగా ఖర్చు చేస్తారు. అందుకే వారు ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవదు.
సరైన పెట్టుబడి పెట్టకపోవడం:
చాణక్యుడి ప్రకారం డబ్బును ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. కొంతమంది డబ్బు సేవ్ చేసినా సరైన పెట్టుబడులు పెట్టరు. సరైన పెట్టుబడి లేకపోతే డబ్బు విలువ పెరగదు. అందుకే డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టడం కూడా చాలా ముఖ్యం.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
వసంతకాలంలో ఈ అందమైన టూరిస్ట్ ప్రదేశాలను మిస్ కాకండి
డిష్ వాషింగ్ స్పాంజ్‌లో బ్యాక్టీరియా..బీ కేర్ ఫుల్
For More Latest News