ఇలాంటి వారిని పొరపాటున కూడా ఇంటికి పిలవకండి..
ABN , Publish Date - Jan 30 , 2026 | 03:41 PM
సాధారణంగా మనం బంధువులు, స్నేహితులను ఇంటికి పిలుస్తాం. కానీ ప్రతి ఒక్కరినీ ఇంటికి పిలవడం మంచిది కాదని ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆచార్య చాణక్యుడు జీవితానికి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలు చెప్పారు. ఆయన చెప్పిన సూత్రాలను పాటిస్తే జీవితంలో విజయాన్ని సాధించవచ్చు. అలాగే, భవిష్యత్తులో వచ్చే సమస్యలు, ప్రమాదాలను తప్పించుకోవాలంటే కొన్ని రకాల వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలని ఆయన సూచించారు. అలాంటి వారిని ఇంటికి ఎప్పుడూ ఆహ్వానించకూడదని చాణక్యుడు చెప్పారు.
సాధారణంగా మనం బంధువులు, స్నేహితులను ఇంటికి పిలుస్తాం. పండుగలు, కార్యక్రమాల సమయంలో అందరినీ ఆహ్వానించడం అలవాటు. కానీ ప్రతి ఒక్కరినీ ఇంటికి పిలవడం మంచిది కాదు. కొంతమంది తమతో పాటూ సమస్యలు, కలహాలు కూడా తీసుకొస్తారు. అందుకే అలాంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలని చాణక్యుడు హెచ్చరించారు.
స్వార్థపరులు..
తమ ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించే వారిని ఇంటికి పిలవకూడదు. వారు మీ మంచిని ఎప్పుడూ కోరరు. అలాంటి వ్యక్తుల వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ ముందొకలా, మీ వెనుక ఒకలా మాట్లాడే వారిని నమ్మకండి. అలాంటి వారు మీకు ప్రమాదకరంగా మారొచ్చు. కాబట్టి వారిని ఇంటికి ఆహ్వానించకూడదు. అంతేకాకుండా, ఇతరులను బాధపెట్టి ఆనందించే వారిని ఎప్పుడూ ఆహ్వానించకండి. వారి చెడు మనస్తత్వం మీకు హాని కలిగించవచ్చు.
అసూయపడే వ్యక్తులు..
ఇతరుల విజయాన్ని చూసి అసూయపడే వారు మీ మంచిని కోరరు. అలాంటి వారిని ఇంటికి పిలిస్తే.. మీ జీవితంలో మరిన్ని సమస్యలు రావొచ్చు. అలాగే, ఎప్పుడూ నెగటివ్‌గా మాట్లాడే వ్యక్తులు ఇంట్లో ఆనందాన్ని తగ్గిస్తారు. కాబట్టి అలాంటి వారిని కూడా దూరంగా ఉంచండి.
నిజాయితీ లేని వారు..
ఎప్పుడూ అబద్ధాలు చెప్పే వారిని ఇంటికి పిలిస్తే సమస్యలు వస్తాయి. మీ పేరు ప్రతిష్టలకు కూడా హాని కలగొచ్చు. నిజాయితీ లేని వారిని కూడా ఇంటికి పిలవకూడదు. అలాంటి వారితో సన్నిహితంగా ఉండటం వల్ల మీ గౌరవం దెబ్బతినే అవకాశం ఉంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఫిబ్రవరిలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ ప్రదేశాలు మిస్ అవ్వొద్దు..
భారత్ యాత్ర కార్డు గురించి తెలుసా? దీంతో ఎన్ని బెనిఫిట్స్ అంటే..
For More Latest News