Share News

భర్తలు జాగ్రత్త.. భార్యకు సంబంధించిన ఈ విషయాలు బయట చెప్పొద్దు

ABN , Publish Date - May 23 , 2026 | 02:05 PM

భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే కొన్ని విషయాలను గోప్యంగా ఉంచుకోవాలని చాణక్య నీతి చెబుతోంది. ముఖ్యంగా భార్యకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వల్ల సంబంధాల్లో దూరం పెరిగే అవకాశం ఉందని సూచిస్తోంది.

భర్తలు జాగ్రత్త.. భార్యకు సంబంధించిన ఈ విషయాలు బయట చెప్పొద్దు
Chanakya Advice for Couples

ఇంటర్నెట్ డెస్క్: భార్యాభర్తల బంధం ఎంతో ప్రత్యేకమైనది. ఈ బంధం బలంగా ఉండాలంటే కొన్ని విషయాలను గోప్యంగా ఉంచుకోవాలని ఆచార్య చాణక్యుడు సూచించారు. ముఖ్యంగా భార్యకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవద్దని ఆయన చెప్పారు. అలాంటి విషయాలు బయట చెప్పడం వల్ల కుటుంబంలో సమస్యలు రావచ్చని పేర్కొన్నారు.


గొడవలు

కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, గొడవలు రావడం సహజమే. అయితే వాటిని ఇతరులతో పంచుకోవడం మంచిది కాదని చాణక్యుడు సూచించారు. అలాంటి విషయాలను బయట చెప్పడం వల్ల కొందరు వాటిని తప్పుగా ఉపయోగించి భార్యాభర్తల మధ్య దూరం పెంచే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

భార్య లోపాలు

భార్యకు ఉన్న అలవాట్లు లేదా చిన్న చిన్న లోపాల గురించి ఇతరుల ముందు మాట్లాడకూడదని చాణక్యుడు సూచించారు. ఇలా చేయడం వల్ల భార్య మనసుకు బాధ కలగడంతో పాటు, దాంపత్య బంధంలో దూరం పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.


ఆరోగ్య సమస్యలు

భార్య అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆమెకు అండగా ఉండాలి కానీ ఆ విషయాలను అందరితో చెప్పి ఆమెను బాధపెట్టకూడదని చాణక్యుడు పేర్కొన్నారు.

గత విషయాలు

పెళ్లికి ముందు జరిగిన విషయాలు లేదా గత సంబంధాల గురించి ఇతరులతో మాట్లాడడం వల్ల అపార్థాలు, మనస్పర్థలు రావచ్చు. అందుకే అలాంటి విషయాలను గోప్యంగా ఉంచాలని చాణక్యుడు సూచించారు. భార్యాభర్తల మధ్య నమ్మకం, గౌరవం, వ్యక్తిగత గోప్యత ఉంటేనే బంధం బలంగా కొనసాగుతుందని చాణక్య నీతి చెబుతోంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

మంగళసూత్రంలో ముత్యాలు, పగడాలు ఎందుకు తప్పనిసరిగా ఉంటాయో తెలుసా?

భక్తులకు గుడ్ న్యూస్.. తిరుపతికి వీక్లీ ఎక్స్‌ప్రెస్

For More Latest News

Updated Date - May 23 , 2026 | 02:10 PM