Share News

ఇది మనకు అవమానం.. తిరిగొచ్చేయండి! ఎన్నారైలకు శ్రీధర్ వెంబు పిలుపు

ABN , Publish Date - May 23 , 2026 | 01:46 PM

గ్రీన్ కార్డు నిబంధనలకు అమెరికా ప్రభుత్వం చేసిన మార్పులు విదేశీయులను అగౌరవపరచడమేనని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు అభిప్రాయపడ్డారు. ఎన్నారైలు భారత్‌కు తిరిగి రావాలని సూచించారు.

ఇది మనకు అవమానం.. తిరిగొచ్చేయండి! ఎన్నారైలకు శ్రీధర్ వెంబు పిలుపు
Sridhar Vembu

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా గ్రీన్‌కార్డు కోసం విదేశీయులు తమ సొంత దేశాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలంటూ ట్రంప్ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇది అక్కడి విదేశీయులు, ముఖ్యంగా ఎన్నారైల్లో కలకలం రేపుతోంది. ఈ పరిణామంపై జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు స్పందించారు. ఆత్మగౌరవానికి ప్రాధాన్యం ఇస్తూ భారతీయులు స్వదేశానికి తిరిగిరావాలని మరోసారి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ పోస్టును జోహో చీఫ్ రీపోస్టు చేస్తూ ఎన్నారైలను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మరోసారి నేను అమెరికాలోని భారతీయులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్.. భారత్‌కు వచ్చేయండి. ఈ క్రమంలో కష్టాలు ఎదురైనా, త్యాగాలు చేయాల్సి వచ్చినా ఇది తప్పదు. మీ ఆత్మగౌరవమే మీకు మార్గనిర్దేశనం చేయాలి. భారతమాత గర్వపడేలా చేద్దాం.. రండి’ అని ఆయన ఎన్నారైలకు పిలుపునిచ్చారు.


గ్రీన్‌కార్డుకు సంబంధించిన కొత్త నిబంధన విదేశీయులను అగౌరవపరచడమేనని శ్రీధర్ వెంబు అభిప్రాయపడ్డారు. భారతీయులు దీన్ని అస్సలు సహించకూడదని స్పష్టం చేశారు. అయితే, ఎన్నారైలు స్వదేశానికి తిరిగి రావాలంటూ గతంలో కూడా శ్రీధర్ వెంబు పిలుపునిచ్చారు. విదేశాల్లో టెక్నాలజీ రంగంలో విశేష నాయకత్వ అనుభవాన్ని గడించిన వారు భారతీయ యువతకు మార్గదర్శకంగా నిలవాలని చెప్పారు. భారత్‌ను సుసంపన్నం చేసేందుకు యుద్ధ సన్నద్ధతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.


ఈ వార్తలనూ చదవండి:

జీతం పెంచమంటే గిఫ్ట్ బ్యాగ్ ఇచ్చిన సంస్థ.. తెరిచి చూస్తే..

మిస్ వెనెజువెలాపై దాడి.. రక్తమోడుతున్న బాధితురాలి వీడియో వైరల్

Updated Date - May 23 , 2026 | 01:57 PM