Share News

మిస్ వెనెజువెలాపై దాడి.. రక్తమోడుతున్న బాధితురాలి వీడియో వైరల్

ABN , Publish Date - May 22 , 2026 | 03:36 PM

గతేడాది మిస్ వెనెజువెలా కిరీటాన్ని దక్కించుకున్న ఒక యువతిపై ఆమె స్టైలిస్ట్ దాడి చేసినట్టు ఉన్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

మిస్ వెనెజువెలాపై దాడి.. రక్తమోడుతున్న బాధితురాలి వీడియో వైరల్
Miss Venezuela Andrea Attacked in Hotel

ఇంటర్నెట్ డెస్క్: గతేడాది అందాల పోటీల్లో మిస్ వెనెజువెలా కిరీటాన్ని దక్కించుకున్న ఆండ్రియాపై ఆమె స్టైలిస్ట్ తాజాగా దాడి చేసినట్టు వెలుగులోకి రావడం రేపుతోంది. కేన్స్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఫ్రాన్స్‌కు వెళ్లిన ఆమెపై మంగళవారం ఒక హోటల్ గదిలో దాడి జరిగినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

రక్తమోడుతున్న ముఖంతో వీడియోలో ఆండ్రియా కనిపించింది. నీ నిజస్వరూపం బయటపడిందంటూ ఆమె తన స్టైలిస్టు లగూనాను విమర్శిస్తుండటం వీడియోలో కనిపించింది. ఈ సందర్భంగా లగూనా సోఫాలో కూర్చుని కనిపించాడు. అసలు వారి మధ్య గొడవకు కారణమేంటని తెలియరాలేదు. గదిలోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటం కూడా వీడియోలో కనిపించింది.


వారి గదిలోంచి ఆర్తనాదాలు, అరుపులు వినిపించాయని హోటల్‌కు వచ్చిన కొందరు చెప్పినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వారిచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు లగూనాను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేశారా? లేదా? అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇక బాధితురాలికి గాయాలైనప్పటికీ ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. లాగూనాకు స్టైలిస్టుగా లాటిన్ అమెరికా దేశాల్లో మంచి పేరుంది. మిస్ యూనివర్స్ కొలంబియా పోటీలకు అతడు 2023 నుంచి క్రియేటివ్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నాడు.


ఈ వార్తలనూ చదవండి:

విద్యార్థినికి తేనెటీగల గడ్డం

అయ్యో.. వరదలో కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్

Updated Date - May 22 , 2026 | 03:51 PM