జీతం పెంచమంటే గిఫ్ట్ బ్యాగ్ ఇచ్చిన సంస్థ.. తెరిచి చూస్తే..
ABN , Publish Date - May 18 , 2026 | 02:19 PM
శాలరీ పెంచమన్న ఉద్యోగులకు ఒక కంపెనీ ఇచ్చిన గిఫ్ట్ నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు తెరతీసింది. జనాలు ఈ గిఫ్ట్‌ను చూసి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అంతకంతకూ పెరుగుతున్న ఖర్చులు చూసి బెదిరిపోయే సామాన్య ఉద్యోగులు ఏటా జీతాల పెంపు కోసం ఆశగా ఎదురు చూస్తారు. ఇలాగే ఎదురు చూసిన తనకు చివర్లో ఊహించని షాక్ తగిలిందంటూ నెటిజన్ పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. కంపెనీ తనకు ఏమిచ్చిందో చెబుతూ ఆ నెటిజన్ రెడిట్ చర్చావేదికలో ఒక ఫొటోను కూడా షేర్ చేశారు.
జీతాలు పెంచమని అడిగితే కంపెనీ తమకు ఒక చిన్న గిఫ్ట్ బ్యాగ్ ఇచ్చిందని అన్నారు. బ్యాగ్ తెరిచి చూశాక తమకు దిమ్మతిరిగినంత పనైందని చెప్పారు. ఒక వాటర్ బాటిల్, పెన్ను, చిన్న చాక్లెట్, కొన్ని బిస్కెట్లు, మరో చిన్న బొమ్మతో ఉన్న ఫొటోను సదరు నెటిజన్ షేర్ చేశారు. శాలరీ పెంచమంటే తమకు చివరకు ఇవే దక్కాయని చెప్పారు. అయితే, ఆ కంపెనీ ఏదో మాత్రం ఆ నెటిజన్ వెల్లడించలేదు.

ఈ పోస్టుకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఆ మాత్రమైనా ఇచ్చినందుకు సంతోపడాలని కొందరు కామెంట్ చేశారు. ఇవి కూడా ఇవ్వకుండా పొమ్మనే కంపెనీలు ఉన్నాయని చెప్పారు. నర్సరీ పిల్లలకు ఇచ్చే గిఫ్టు కంటే ఇవి చిన్న బహుమతులని మరికొందరు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో పరిస్థితులు ఇలాగే ఉన్నాయని మరికొందరు ముక్తాయించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
వామ్మో.. భార్యతో ఇలాంటి జోకులా.. నెట్టింట వీడియో వైరల్
రైలు బాత్‌రూమ్‌లో షాకింగ్ సీన్.. వీడియో వైరల్