వామ్మో.. భార్యతో ఇలాంటి జోకులా.. నెట్టింట వీడియో వైరల్
ABN , Publish Date - May 16 , 2026 | 10:15 AM
తన భార్యతో వెయ్యకూడని జోక్ వేసేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. జనాలు ఈ వీడియోకు బ్రహ్మరథం పడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నెట్టింట కొందరు కంటెంట్ క్రియేటర్లు షేర్ చేసే వీడియోలు జనాలను కడుపుబ్బా నవ్విస్తుంటాయి. అవి కేవలం సరదా కోసం చేసే స్క్రిప్టెడ్ వీడియోలేనని తెలిసినా జనాలు వీటికి బ్రహ్మరథం పడుతుంటారు. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఒక వ్యక్తి తన భార్య చిత్రాన్ని వేసేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆమెను ఆటపట్టించాలనే ఉద్దేశంతో ఆమె చిత్రాన్ని వీలైనంత వంకరగా గీశాడు. చింపిరి జట్టు, తొర్రి పళ్లు వంటి వీలైనన్ని అవకరాలను జోడించాడు. భార్య మాత్రం తన భర్త చిత్రాన్ని అద్భుతంగా వేస్తున్నాడనుకుని ముసిముసి నవ్వులతో అతడు చెప్పినట్టు పోజులు ఇచ్చింది. అయితే, వీక్షకుల్లో సస్పెన్స్ క్రియేట్ చేసేలా వీడియో అక్కడితోనే ముగిసింది. అతడు తన భార్యకు చిత్రాన్ని చూపించాడా? లేదా? అనేది మాత్రం తెలియరాలేదు.
జనాల ఎంటర్‌టెయిన్‌మెంట్ కోసం చేసిన ఈ వీడియోకు నెట్టింట మంచి స్పందన వచ్చింది. వీడియో స్క్రిప్ట్ బాగుందని అనేక మంది మెచ్చుకున్నారు. భార్యపై ఇలాంటి జోకులు వేసే సాహసం ఏ భర్తకూ ఉండదని మరికొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
రైలు బాత్‌రూమ్‌లో షాకింగ్ సీన్.. వీడియో వైరల్
ప్యాసింజర్‌కు రైల్వే శాఖ ఊహించని సర్‌ప్రైజ్!