ప్యాసింజర్‌కు రైల్వే శాఖ ఊహించని సర్‌ప్రైజ్!
ABN , Publish Date - May 15 , 2026 | 04:02 PM
ఒక ప్రయాణికుడికి భారతీయ రైల్వే ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆయన పోగొట్టుకున్న లక్షల విలువైన బంగారపు ఉంగరాన్ని తిరిగిచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: రైల్వే శాఖ ఒక ప్యాసింజర్‌కు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. టాయిలెట్‌లో ఆయన పోగొట్టుకున్న లక్షల విలువైన బంగారపు ఉంగరాన్ని తిరిగిచ్చింది. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే, ముంబై నుంచి భుజ్‌కు రైల్లో వెళ్లిన ఒక ప్యాసింజర్ రైల్లోని టాయిలెట్‌లో తన బంగారు ఉంగరాన్ని పోగొట్టుకున్నారు. పొరపాటున ఆయన వేలి నుంచి జారిన ఉంగరం టాయిలెట్‌లో పడి చివరకు వ్యర్థాల ట్యాంకులోకి చేరింది. ఇక ఆ ఉంగరం తనకు లభించదని ఆ ప్రయాణికుడు నిర్ధారణకు వచ్చేశారు. కానీ రైల్వే శాఖ మాత్రం ఆయనకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది.
రైలు అహ్మదాబాద్ స్టేషన్‌కు చేరుకోగానే సిబ్బంది రంగంలోకి దిగారు. సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (సీ అండ్ డబ్ల్యూ) సంజయ్ యాదవ్, సీటీసీ సభ్యులు కొన్ని గంటల పాటు రైల్లోని పైపులు, వ్యర్థాల ట్యాంకులో వెతికి ఉంగరాన్ని వెలికితీశారు. దీంతో, ప్రయాణికుడి సంతోషానికి అంతే లేకుండా పోయింది.
ప్రయాణికుడు పోగొట్టుకున్న వస్తువును తిరిగి అందించడంలో నిబద్ధత కనబరిచిన సిబ్బందిని డీఆర్‌ఎమ్ వేద ప్రకాశ్ అభినందించారు. అంతటి ఇబ్బందికర పరిస్థితుల్లోనూ విధులు నిర్వర్తించిన వారిని కొనియాడారు. తమపై ప్రయాణికులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కూడా తమ బాధ్యతేనని పేర్కొన్నారు. ఈ ఉదంతంపై నెట్టింట కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. రైల్వే సిబ్బందిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
ఈ వార్తలనూ చదవండి:
రైలు బాత్‌రూమ్‌లో షాకింగ్ సీన్.. వీడియో వైరల్
ప్లాట్‌ఫామ్ కింద పడ్డ విదేశీ యువతి స్కార్ఫ్.. పట్టాలపైకి దూకిన వ్యక్తి.. చివరికి..