ఈ అలవాట్లే అకాల వృద్ధాప్యానికి కారణం
ABN , Publish Date - Apr 16 , 2026 | 04:59 PM
చిన్న వయసులోనే వృద్ధుల్లా కనిపించడం ఈ రోజుల్లో చాలా మందిలో కనిపించే సాధారణ సమస్యగా మారుతోంది. అయితే, కొన్ని చెడు అలవాట్లు అకాల వృద్ధాప్యానికి దారితీస్తాయని ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో పేర్కొన్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ప్రతీ ఒక్కరికీ వయసు పెరగడం సహజం. కానీ కొందరు మాత్రం చిన్న వయసులోనే వృద్ధుల్లా కనిపిస్తారు. 25–30 ఏళ్ల వయసులోనే 40 ఏళ్లలా కనిపించడం వెనుక కొన్ని చెడు అలవాట్లు కారణమని ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో పేర్కొన్నారు. ఈ అలవాట్లను మానుకుంటే అకాల వృద్ధాప్యాన్ని నివారించవచ్చని ఆయన సూచించారు.
ప్రతికూల ఆలోచనలు
ఎప్పుడూ నెగెటివ్‌గా ఆలోచించే వ్యక్తులు త్వరగా వృద్ధుల్లా కనిపిస్తారు. వారు జీవితంలో మంచి విషయాలను ఆస్వాదించకుండా, ప్రతిదాంట్లో లోపాలనే చూస్తుంటారు. దీని వల్ల మానసిక ఒత్తిడి పెరిగి, ముఖంలో వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనిపిస్తాయి.
చెడు వ్యసనాలు
మాదకద్రవ్యాలు, మద్యం, జూదం వంటి వ్యసనాలు ఆరోగ్యానికే కాదు, వ్యక్తిత్వానికీ హానికరం. ఇవి శరీరాన్ని బలహీనపరచడంతో పాటు మానసికంగా కూడా దెబ్బతీస్తాయి. దీని ఫలితంగా వ్యక్తి త్వరగా వృద్ధుడిలా కనిపిస్తాడు.
అధిక చింత
గతం గురించి బాధపడటం, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం మనసుకు శాంతి ఇవ్వదు. ఎప్పుడూ ఆలోచనల్లో మునిగిపోయి ఉండటం వల్ల ఒత్తిడి పెరిగి అకాల వృద్ధాప్యానికి దారితీస్తుంది. చాణక్యుడి ప్రకారం, మనం ఎప్పుడూ వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఈ అపోహలు నమ్మితే బరువు తగ్గడం కష్టం
సమ్మర్‌లో రోజూ షూ వేసుకుంటున్నారా?
For More Latest News