ధనవంతులుగా మారాలనుకుంటున్నారా..? అయితే చాణక్యుడి సూచనలివే
ABN , Publish Date - Nov 15 , 2026 | 03:29 PM
ధనవంతులుగా మారాలనే కోరిక లేనివారు దాదాపుగా ఉండరు. కానీ ఆ అవకాశం, అదృష్టం కొందరికే ఉంటాయి.
ఇంటర్నెట్ డెస్క్: ధనవంతులుగా మారాలనే కోరిక లేనివారు దాదాపుగా ఉండరు. కానీ ఆ అవకాశం, అదృష్టం కొందరికే ఉంటాయి. అయితే మీరు ధనవంతులుగా మారాలంటే కొన్ని సూచనలను పాటించి తీరాలని చాణక్య నీతి చెబుతోంది. పలు విషయాలను ఎల్లవేళలా రహస్యంగానే ఉంచాలని వివరిస్తోంది. అప్పుడే ఆర్థిక బలం పెరుగుతుందని బోధిస్తోంది. ఇంతకీ చాణక్యుడు రహస్యంగా ఉంచాలని చెప్పిన అంశాలేంటో చూద్దామా..
జీతం ఎంతో చెప్పకూడదు..
చాణక్య నీతి ప్రకారం వ్యక్తులు తమ పూర్తి జీతం ఎంతో ఇతరులకు చెప్పడం మానుకోవాలి. ఎందుకంటే ఇతరులు మీ ఆదాయాన్ని వారి ఆదాయంతో పోల్చుకుంటారు. మీ జీతం ఎక్కువైతే వారు అసూయపడతారు. అదే తక్కువైతే చిన్న చూపు చూస్తారు. అందుకే స్నేహితులతో, బంధువులతో జీతం వెల్లడించకూడదు.
ఆ సమాచారం ఇవ్వకూడదు..
మీ పొదుపునకు సంబంధించిన సమాచారం ఇతరులకు ఇవ్వకూడదు. ఉదాహరణకు మీరు అనునిత్యం కష్టపడి సంపాదించిన నగదును బ్యాంక్‌లో దాచుకుంటే.. ఆ బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్ ఎప్పుడూ ఇతరులు చెప్పకూడదు. ఎందుకంటే బ్యాలెన్స్ ఎక్కువ ఉంటే ఇతరులు మిమ్మల్ని రుణం అడగొచ్చు. అందుకే పొదుపును గోప్యంగా ఉంచండి.
అప్పుల వివరాలు రహస్యంగా ఉంచాలి..
అప్పులు ఎప్పుడూ రహస్యంగానే ఉంచాలని ఆచార్య చాణక్యుడు బోధించారు. మీకు ఉన్న అప్పు ఎంత..? దానికి వడ్డీ ఏమాత్రం ఉంది..? అనే ప్రశ్నల సమాధానాలు ఇతరులకు తెలియకూడదని గుర్తుంచుకోవాలి. ఈరోజుల్లో ఈఎంఐ చెల్లింపులు బాగా పెరిగాయి. చాణక్యుడి ప్రకారం ఈఎంఐ వివరాలూ పంచుకోకూడదు.
లాభాల ప్రదర్శన వద్దు..
ఒకోసారి మనకు ఊహించని లాభాలు వస్తాయి. వాటిని బయటకు ప్రదర్శించకూడదు. ఉదాహరణకు బోనస్ రావడం, స్టాక్ మార్కెట్‌లో షేర్ల విలువ పెరగడం వంటివి. ఇలాంటి లాభాలు ఇతరులకు తెలిసేలా గొప్పలు చెప్పుకోవడం మానుకోవాలి.
ఈ వార్తలు చదవండి
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. పుణే విమానాశ్రయంలో తప్పిన పెను ప్రమాదం
రామ్‌లీలా మైదానంలో ఇకపై 50 వేల మందికే అనుమతి