Share News

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు, టిప్పర్‌ ఢీకొని ముగ్గురి మృతి

ABN , Publish Date - Nov 15 , 2026 | 07:37 AM

తిరుపతి జిల్లా చంద్రగిరి టోల్‌గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, టిప్పర్ ఢీకొని ముగ్గురు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు, టిప్పర్‌ ఢీకొని ముగ్గురి మృతి
Chandragiri Road Accident

తిరుపతి జిల్లా: చంద్రగిరి టోల్‌గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, టిప్పర్ ఢీకొని ముగ్గురు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సిక్స్‌వే మార్గం నుంచి పాత సర్వీస్ రోడ్డులోకి వెళ్తున్న కారు.. ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.


సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్ సిబ్బంది వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? అనే వివరాలను సేకరిస్తున్నారు. అలాగే, క్షతగాత్రుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

18న శ్రీవారి ఆర్జితసేవల కోటా విడుదల

జగన్‌ కుటుంబంపై జుగుప్సాకర వ్యాఖ్యల్ని ఖండిస్తున్నా

Updated Date - Nov 15 , 2026 | 07:53 AM