18న శ్రీవారి ఆర్జితసేవల కోటా విడుదల
ABN , Publish Date - Nov 15 , 2026 | 04:48 AM
తిరుమల శ్రీవారి ఆర్జితసేవల ఫిబ్రవరి నెలకు సంబంధించిన కోటాను టీటీడీ ఈ నెల 18వ తేదీన ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
తిరుమల, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆర్జితసేవల ఫిబ్రవరి నెలకు సంబంధించిన కోటాను టీటీడీ ఈ నెల 18వ తేదీన ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన సేవకు సంబంధించిన కోటాను 18వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ఈ ఎలక్ట్రానిక్ డిప్ కోసం భక్తులు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు.
ఇక, 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకారసేవల టికెట్లను, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలను కేటాయిస్తారు. అలాగే 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి టోకెన్లు జారీ చేస్తారు. ముఖ్యంగా 24వ తేదీ ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేస్తారు. భక్తులు వీటిని ‘టీటీదేవస్థానమ్స్.ఏపీ.జీవోవీ.ఇన్’ అనే వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు.
ఈ వార్తలనూ చదవండి:
జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం