Share News

సమాజంలో గౌరవం పొందాలంటే ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి.!

ABN , Publish Date - Jan 20 , 2026 | 02:01 PM

సమాజంలో గౌరవం పొందాలంటే ఈ ఐదు విషయాలు గుర్తుంచుకోవాలని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించారు. ఈ ఐదు విషయాలను ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదని ఆయన సూచించారు.

సమాజంలో గౌరవం పొందాలంటే ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి.!
Chanakya Neeti On Respect

ఇంటర్నెట్ డెస్క్: చాణక్య నీతి ప్రకారం.. గౌరవం అనేది అడిగి తీసుకునేది కాదు.. మన ప్రవర్తన ద్వారా సంపాదించుకునేది. సమాజంలో నమ్మకం, పేరు, గౌరవం పొందాలంటే ప్రతి ఒక్కరూ కొన్ని మంచి అలవాట్లు తప్పనిసరిగా పాటించాలని ఆచార్య చాణక్యుడు చెప్పారు. ఈ విషయాలను అనుసరిస్తే ఆలోచన విధానం, జీవనశైలి కచ్చితంగా మారుతుందని సూచించారు. సమాజంలో గౌరవం పొందాలంటే ఈ 5 విషయాలు గుర్తుంచుకోవాలని తన నీతి శాస్త్రంలో వివరించారాయన.


మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి..

తనను తాను గౌరవించుకోని వ్యక్తిని ప్రపంచం ఎప్పుడూ గౌరవించదని చాణక్యుడు చెప్పారు. మీరు మీకే విలువ ఇవ్వకపోతే.. ఇతరులూ మిమ్మల్ని తక్కువగా చూస్తారు. మీ ఆలోచనలు, సమయం, కృషిని గౌరవించుకోవడం మొదలుపెట్టినప్పుడే సమాజం కూడా మీకు విలువ ఇస్తుంది.

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి..

వ్యక్తి నిజాయతీని తెలుసుకోవాలంటే అతని మాటలను గమనించాలని చాణక్యుడు అన్నారు. ఇచ్చిన మాటపై నిలబడని వారిపై నమ్మకం ఉండదు. నమ్మకం తగ్గిన చోట గౌరవమూ తగ్గిపోతుంది. అందుకే మాట ఇచ్చేముందు జాగ్రత్తగా ఆలోచించి ఇవ్వాలి. చేయలేని వాటికి మాటివ్వకపోవడం మంచిదని సూచించారు.


అతి వినయంగా ఉండకూడదు..

ఇతరులను సంతోషపెట్టడమే లక్ష్యంగా ఉండటం వల్ల సమాజంలో మీ విలువ తగ్గుతుంది. వినయం అవసరమే కానీ ఆత్మగౌరవాన్ని కోల్పోకూడదని చాణక్యుడు చెప్పారు. స్పష్టంగా, సమతుల్యంగా మాట్లాడే వ్యక్తికే గౌరవం లభిస్తుంది.

తప్పును సమర్థించకండి..

తప్పును సమర్థించే వారు చివరకు తమ గౌరవాన్ని కోల్పోతారని చాణక్య నీతి స్పష్టంగా చెబుతోంది. అబద్ధాలు, అన్యాయ మార్గాలు తాత్కాలిక లాభం ఇవ్వొచ్చు. కానీ వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తాయి. నిజాయతీగా జీవిస్తేనే మనకు దీర్ఘకాలం పాటు గౌరవం లభిస్తుంది.

మంచి ప్రవర్తన..

కోపంతో మాట్లాడటం, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల సంవత్సరాల పాటు సంపాదించిన పేరు ఒక్క క్షణంలో పోతుంది. తరచూ కోప్పడేవారిని ప్రజలు దూరం పెడతారు. ప్రశాంతంగా, సహనంతో వ్యవహరించే వ్యక్తికే సమాజంలో నిజమైన గౌరవం లభిస్తుందని చాణక్యుడు చెప్పారు.


Also Read:

తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?

జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?

For More Latest News

Updated Date - Jan 20 , 2026 | 02:36 PM