తరుముకొస్తున్న క్యాన్సర్ మహమ్మారి.. ప్రతి 10 మందిలో ఒకరికి..
ABN , Publish Date - Jun 29 , 2026 | 07:14 AM
ప్రస్తుత ప్రపంచంలో మానవుడి జీవనశైలి మారుతోంది. ఆహారం, ఒత్తిడి, కాలుష్యం కారణంగా ఆరోగ్యాన్ని క్షీణిస్తోంది. దీంతో చిన్న వయస్సులోనే అనారోగ్యం బారిన పడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత ప్రపంచంలో మానవుడి జీవనశైలి మారుతోంది. ఆహారం, ఒత్తిడి, కాలుష్యం కారణంగా ఆరోగ్యం క్షీణిస్తోంది. దీంతో చిన్న వయస్సులోనే అత్యధిక శాతం మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. మరి ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. 2030 నాటికి ప్రతి 10 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిపుణుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే ప్రతి 9 మంది భారతీయుల్లో ఒకరు తమ జీవితకాలంలో క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని అవి వెల్లడిస్తున్నాయి.
వృద్ధుల జనాభా పెరుగుదల, పర్యావరణ కాలుష్యం, జీవనశైలి, ఒత్తిడి కారణంగా క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తాజా వైద్య నివేదికల ప్రకారం 2023 నాటికి దేశంలో ఏటా 15.7 లక్షల నుంచి 20 లక్షల వరకు కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది గణాంకాలతో సహా వివరిస్తున్నాయి.
భారత్‌లో 70 శాతానికి పైగా క్యాన్సర్ కేసులు చివరి దశలలో (3వ లేదా 4వ దశ) నిర్ధారణ అవుతున్నాయి. దీనివల్ల చికిత్స అందించడం కష్టమవుతుంది. పురుషుల్లో ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్ కేసులు అధికంగా ఉంటున్నాయి. మహిళల్లో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అయితే గతంలో క్యాన్సర్‌ను వృద్ధులకు వచ్చే వ్యాధిగా పరిగణించేవారు. కానీ ఎయిమ్స్‌లోని వైద్య నిపుణుల నివేదిక ప్రకారం.. పొగతాగని వారు.. ముఖ్యంగా యువకులు, మహిళలు దీని బారిన పడుతున్నారు. తీవ్ర వాయు కాలుష్యం, పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి.. క్యాన్సర్ వచ్చేందుకు ప్రధాన కారణం అవుతున్నాయి.
క్యాన్సర్ నివారణ మన చేతుల్లోనే ఉంది. చిన్న చిన్న నిర్ణయాలతో పెద్ద మార్పులు తీసుకురావచ్చు. క్యాన్సర్‌ను పూర్తిగా నివారించలేనప్పటికీ, సరైన జాగ్రత్తలతో దాని ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
ఇలా చేస్తే.. సురక్షితం..
పొగాకు వాడవద్దు..
భారత్‌లో దాదాపు 40 నుంచి 50 శాతం క్యాన్సర్ కేసులు కేవలం పొగాకు వాడకం వల్లే వస్తున్నాయి. సిగరెట్లు, బీడీ, గుట్కా మానేయడం, మద్యం సేవించడాన్ని తగ్గించడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు.
ప్రతి ఏటా ఆరోగ్య పరీక్ష..
40 ఏళ్ల వయస్సు దాటిన మహిళలు ఏడాదికి ఒకసారి ఆరోగ్య పరీక్ష చేయించుకోవాలి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ (పాప్ స్మియర్, మామోగ్రఫీ) చేయించుకోవాలి. క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే 100 శాతం నయం చేయవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
క్యాన్సర్ చికిత్స చాలా ఖరీదైనది. దీనికి లక్షల రూపాయిల ఖర్చవుతుంది. దీంతో ఈ వ్యాధి వస్తే.. చాలా కుటుంబాలు తమ ఆస్తి, భూమి లేదా పొదుపు చేసిన నగదును అమ్ముకోవలసి వస్తుంది. ముందుగానే సరైన ఆర్థిక ప్రణాళిక ఉంటే.. ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
ఆరోగ్య బీమా ఉంటే..
క్యాన్సర్ చికిత్సకు కీమోథెరపీ, రేడియేషన్, శస్త్ర చికిత్సతోపాటు ఖరీదైన మందులు అవసరం అవుతాయి. దీనికి రూ.10 లక్షల నుంచి రూ. 50 లక్షల లేదా అంతకంటే అధికంగా ఖర్చు కావచ్చు. సరైన ఆరోగ్య బీమా చేసుకుని ఉంటే ఆ ఆర్థిక భారాన్ని నివారించడంలో మీకు సహాయపడుతుంది. మీ ఆరోగ్య బీమా పాలసీలో క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ లేదా ప్రత్యేక క్యాన్సర్ కేర్ ప్లాన్ తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది.
ఒక వేళ మీకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయితే.. పాలసీలోని మొత్తం సొమ్ము మీకు ఒకేసారి చెల్లించడుతుంది. కాబట్టి క్యాన్సర్ నివారణ మన చేతుల్లోనే ఉంది. చిన్న మార్పులు కూడా పెద్ద మార్పును తీసుకురాగలవు. క్యాన్సర్‌ను పూర్తిగా నివారించలేనప్పటికీ.. సరైన జాగ్రత్తలతో దాని ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
డ్రై ఫ్రూట్స్‌కు పురుగులు పడుతున్నాయా? ఇవిగో సింపుల్ చిట్కాలు..
బంగాళదుంపలు ఉడికించిన నీటిని పారబోస్తున్నారా?
For More LifeStyle News And Telugu News