Share News

భారత్‌పై 17 శాతం సుంకాలు.. 14 దేశాలకు ట్రంప్ సర్కారు కొత్త షాక్..

ABN , Publish Date - Nov 25 , 2026 | 08:16 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పలు దేశాలకు షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. భారత్, చైనా సహా 14 దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై కొత్తగా సుంకాలు విధించేందుకు అమెరికా ప్రభుత్వం ప్రతిపాదనలు ప్రకటించింది.

భారత్‌పై 17 శాతం సుంకాలు.. 14 దేశాలకు ట్రంప్ సర్కారు కొత్త షాక్..
Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పలు దేశాలకు షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. భారత్, చైనా సహా 14 దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై కొత్తగా సుంకాలు విధించేందుకు అమెరికా ప్రభుత్వం ప్రతిపాదనలు ప్రకటించింది. కొన్ని దేశాలపై ఈ సుంకాలు 20 శాతం వరకు ఉండనున్నాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం భారత్‌పై 17 శాతం, చైనాపై 20 శాతం సుంకాన్ని ప్రతిపాదించారు. అమెరికా వాణిజ్య లోటును తగ్గించడం, దేశీయ పరిశ్రమలను రక్షించడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది (US Tariffs on India).


అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం ఎనిమిది నెలల పాటు నిర్వహించిన విచారణ అనంతరం ఈ ప్రతిపాదనలు వెల్లడించింది. భారత్‌తో పాటు చైనా, యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా సహా మొత్తం 14 వాణిజ్య భాగస్వామ్య దేశాలను ఇందులో చేర్చారు. భారత్‌పై 17 శాతం, చైనా, వియత్నాంపై 20 శాతం వరకు సుంకాలు ఉండనున్నాయి. ఇతర దేశాలపై 10 నుంచి 18 శాతం మధ్య ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ సుంకాలు ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. ప్రజాభిప్రాయ సేకరణ, విచారణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు (India US Trade Relations).


ఈ ప్రతిపాదనలోని 14 దేశాలు తమ పారిశ్రామిక రంగాలకు అధికంగా సబ్సిడీలు అందించడం, మార్కెట్ డిమాండ్‌కు మించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం వల్ల అమెరికా కంపెనీలకు నష్టం కలుగుతోందని ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది (17 Percent Tariff on India). అయితే అన్ని ఉత్పత్తులపై ఒకే విధంగా ఈ సుంకాలు వర్తించవు. నిర్దిష్ట ఉత్పత్తులకు మాత్రమే ప్రతిపాదిత సుంకాలు వర్తిస్తాయని అమెరికా అధికారులు స్పష్టం చేశారు. అందువల్ల ఏ రంగంపై ఎంత ప్రభావం ఉంటుందనేది తుది నిబంధనలు వెలువడిన తర్వాతే స్పష్టమవుతుంది.


ఇవి కూడా చదవండి..

ఆకాశంలో వెండివెన్నెల.. హిమాలయాల మధ్య చంద్రోదయం.. వీడియో వైరల్..


తిరుపరంకుండ్రం కొండపై దీపం వివాదం.. వందేళ్ల క్రితం అసలేం జరిగిందంటే..

Updated Date - Nov 25 , 2026 | 08:16 PM