గల్ఫ్ దేశాల పునర్నిర్మాణం కోసం.. ఇరాన్ ఆస్తులపై అమెరికా కన్ను వేసిందా..
ABN , Publish Date - Jun 07 , 2026 | 04:21 PM
ఇరాన్ దాడులతో నష్టపోయిన గల్ఫ్ మిత్రదేశాలకు సహాయం చేసేందుకు అమెరికా ప్రణాళికలు రచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకోసం ఇరాన్ ఆస్తులను వినియోగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది
ఇరాన్ దాడులతో నష్టపోయిన గల్ఫ్ మిత్రదేశాలకు సహాయం చేసేందుకు అమెరికా ప్రణాళికలు రచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకోసం ఇరాన్ ఆస్తులను వినియోగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అంశంపై అమెరికా ట్రెజరీ శాఖ ఖర్చుల అంచనా ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం. అమెరికా-ఇరాన్ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోయాయి (US Iran tensions).
యుద్ధం కారణంగా కువైట్, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. మౌలిక వసతులు కూడా దెబ్బతిన్నాయి. దీంతో గల్ఫ్ మిత్ర దేశాల పునర్నిర్మాణం కోసం సహాయం అందించాలని అమెరికా భావిస్తున్నట్టు సమాచారం. అందుకోసం ఇరాన్ అస్తులను వినియోగించుకోవాలని అనుకుంటోందట. ఇరాన యుద్ధం కారణంగా గల్ఫ్ మిత్ర దేశాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఒక బృందాన్ని ఆదేశించినట్టు సమాచారం (Iranian assets).
గల్ప్ మిత్ర దేశాలపై దాడుల వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ఇరాన్‌కు చెందిన స్తంభింపజేసిన నిధులను లేదా ఇతర ఆస్తులను ఉపయోగించాలనే ప్రతిపాదనపై చర్చ జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. (Gulf allies). కాగా, ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు అనిశ్చితిలో ఉన్నాయి. అమెరికాలో స్తంభింపజేసిన 24 బిలియన్ డాలర్ల ఆస్తులను విడుదల చేస్తేనే శాంతి ఒప్పందంపై ముందుకు వెళతామని ఇరాన్ ఇప్పటికే పేర్కొంది. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల పునర్నిర్మాణానికి ఇరాన్ ఆస్తులను వినియోగించాలనే అమెరికా వ్యూహం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే ఆందోళనలు నెలకొన్నాయి.
ఇవి కూడా చదవండి..
మోదీ ఇచ్చిన వజ్రాన్ని కొనాలనుకున్నా.. కానీ..: జిల్ బైడెన్..
భారత్‌తో కొత్త అధ్యాయానికి సిద్ధం: నేపాల్ విదేశాంగ మంత్రి