Share News

ట్రంప్‌నకు మరో ఎదురుదెబ్బ.. 5 మిలియన్ డాలర్లు చెల్లించాలని కోర్టు ఆదేశం..

ABN , Publish Date - Jul 09 , 2026 | 08:16 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరో న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలింది. లైంగిక వేధిపుల కేసులో ట్రంప్‌ను అమెరికా ఫెడరల్ కోర్టు దోషిగా తేల్చింది.

ట్రంప్‌నకు మరో ఎదురుదెబ్బ..  5 మిలియన్ డాలర్లు చెల్లించాలని కోర్టు ఆదేశం..
Donald Trump, E Jean Carroll

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరో న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలింది. లైంగిక వేధిపుల కేసులో ట్రంప్‌ను అమెరికా ఫెడరల్ కోర్టు దోషిగా తేల్చింది. రచయిత్రి, మాజీ కాలమిస్టు జీన్ క్యారల్‌కు 5 మిలియన్ అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.47 కోట్లు) చెల్లించాలని అమెరికా ఫెడరల్ కోర్టు ఆదేశించింది (Donald Trump, E Jean Carroll).


2023లో విచారణ జరిపిన జ్యూరీ, ట్రంప్ లైంగిక దాడికి పాల్పడినట్లు, అనంతరం క్యారల్ పరువును దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినట్లు తేల్చింది. దీంతో 5 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని అప్పుడే తీర్పు వెలువరించింది. లైంగిక దాడికి గాను 2 మిలియన్ డాలర్లు, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలకు గాను 3 మిలియన్ డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ మే 2023లో కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ట్రంప్ చేసిన అప్పీలును విచారించడానికి గత వారం అమెరికా సుప్రీంకోర్టు నిరాకరించింది (Trump Lawsuit).


1996లో న్యూయార్క్‌లోని ఒక డిపార్ట్‌మెంట్ స్టోర్‌లోని డ్రెస్సింగ్ రూమ్‌లో తనపై ట్రంప్ లైంగిక దాడి చేశారని క్యారల్ ఆరోపించారు (Defamation on Trump). ఆ విషయాన్ని 2019లో ప్రచురితమైన ఓ పుస్తకంలో క్యారల్ రాశారు. ఆ ఆరోపణలు పూర్తిగా కల్పితమని, క్యారల్ ఒక పిచ్చిదని ట్రంప్ కొట్టిపడేశారు. కాగా, ఇది ట్రంప్‌నకు సంబంధించిన ఏకైక సివిల్ కేసు కాదు. 2024లో పరువు నష్టం కేసులో క్యారల్‌కు అదనంగా 83.3 మిలియన్ డాలర్లు చెల్లించాలని మరో జ్యూరీ తీర్పు ఇచ్చింది. ఆ కేసు కూడా ప్రస్తుతం న్యాయపరమైన ప్రక్రియలో కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి..

మరోసారి ఇరాన్‌పై అమెరికా దాడులు.. కొనసాగుతున్న ఉద్రిక్తత..


మరింతగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 09 , 2026 | 09:07 AM