ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు.. పలు సైనిక కేంద్రాలు ధ్వంసం..
ABN , Publish Date - Jun 28 , 2026 | 07:37 AM
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ అమెరికా మరోసారి వైమానిక దాడులకు దిగింది.
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ అమెరికా మరోసారి వైమానిక దాడులకు దిగింది. ఇరాన్‌లోని పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, యుద్ధ విమానాలతో దాడులు నిర్వహించింది. దీంతో ఆందోళనలు మళ్లీ మొదటికి వచ్చాయి (US strikes Iran).
అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇరాన్‌లోని క్షిపణుల నిల్వ కేంద్రాలు, డ్రోన్ స్థావరాలు, రాడార్ వ్యవస్థలు, నిఘా కేంద్రాలు, సముద్ర మార్గాల్లో దాడులకు ఉపయోగించే సైనిక మౌలిక వసతులపై దాడులు జరిగాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్గనిర్దేశకత్వంలోనే దాడులు జరిగినట్టు సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని బలహీనపరచడమే తమ లక్ష్యమని పేర్కొంది. ఇటీవల హోర్ముజ్ జలసంధిలోని వాణిజ్య నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో ఉద్రిక్తతలు మళ్లీ మొదలయ్యాయి (Iran War latest news).
అమెరికా ప్రయోజనాలు, అంతర్జాతీయ సముద్ర రవాణాకు ముప్పు కలిగించే చర్యలు కొనసాగితే మరింత కఠినమైన సైనిక చర్యలు తప్పవని తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు (Iran US conflict). కాల్పుల విరమణ ఉల్లంఘించకుండా ఉండేందుకు ఇరాన్‌కు అవకాశం ఇచ్చినా పదే పదే ఆ దేశం దాడులు చేస్తోందని అమెరికా ఆరోపించింది. రెండు మిలియన్ బ్యారెళ్ల చమురుతో వెళ్తున్న పనామా జెండా కలిగిన కికు ట్యాంకర్‌పై ఇరాన్ తాజాగా డ్రోన్ దాడికి పాల్పడినట్టు వెల్లడించింది. దీంతోనే తాము తాజా దాడులు చేసినట్టు తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి...
తప్పు ఎవరు చేసినా తప్పే.. కులం ఆధారంగా చూడొద్దు: పవన్ కల్యాణ్
‘రాజధాని ద్రోహి జగన్, గో బ్యాక్’ అంటూ అమరావతి రైతుల నినాదాలు