గుర్తుపట్టలేనంతగా గాయపడిన ఇరాన్ సుప్రీం లీడర్ మెుజ్తాబా.. యూఎస్ రక్షణ మంత్రి
ABN , Publish Date - Mar 13 , 2026 | 08:44 PM
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని, గుర్తుపట్టలేనంతగా మారినట్టు తెలుస్తోందని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు.
వాషింగ్టన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) తీవ్రంగా గాయపడ్డారని, గుర్తుపట్టలేనంతగా మారినట్టు తెలుస్తోందని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) తెలిపారు. ఇరాన్‌పై దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని మొజ్తాబా ఖమేనీ ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారంనాడిక్కడ మీడియా సమావేశంలో హెగ్సెత్ తాజా వ్యాఖ్యలు చేశారు.
'ఆయన (మొజ్తాబా) గాయపడి వికృతంగా మారినట్టు తెలుస్తోంది. ఆయన నిన్న ఒక ప్రకటన చేసారు. ఆయన వాయిస్ కానీ, వీడియో కానీ లేదు. కేవలం లిఖిత పూర్వక ప్రకటనే మాత్రమే ఉంది. ఇరాన్‌లో కెమెరాలు, వాయిస్ రికార్డర్లకు కొదవలేదు. లిఖిత పూర్వక ప్రకటనే ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకో తెలుసా? ఆయన భయపడుతున్నారు, గాయపడ్డారు, పారిపోతున్నారు. ఆయనకు చట్టబద్ధత లేదు. అక్కడంతా గందరగోళంగా ఉంది. అసలు ఇన్‌చార్జి ఎవరు? ఇరాన్‌కు కూడా ఆవిషయం తెలియకపోవచ్చు' అని హెగ్సెత్ అన్నారు.
యుద్ధం లక్ష్యాన్ని సాధించాం
ఇరాన్‌ను ఓడించి, మిలటరీ సామర్థ్యాన్ని నిర్వీర్వం చేసేందుకు ప్రపంచంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో అమెరికా దాడులు జరిపిందని హెగ్సెత్ తెలిపారు. యుఎస్ అనుకున్న లక్ష్యాన్ని సాధించిందని, ఈరోజు కూడా ఇరాన్, టెహ్రాన్‌పై అమెరికా పెద్ద ఎత్తున దాడులు జరిపిందని చెప్పారు. రాబోయే రోజుల్లో దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని తెలిపారు. మినాబ్‌లోని పాఠశాలపై దాడిలో పెద్దఎత్తున విద్యార్థులు మృతిచెందడంపై అడిగినప్పుడు, అమెరికా ఎప్పుడూ పౌరులపై దాడులు జరపదని, అది ఇరాన్ పనేనని, అయితే దీనిపై వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ఆ వివరాలను తెలియజేస్తామని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఇరాక్‌లో కుప్పకూలిన అమెరికా రీఫ్యూయలింగ్ విమానం.. నలుగురు సిబ్బంది మృతి
వారిని అంతం చేస్తాను.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక