Share News

ఇరాక్‌లో కుప్పకూలిన అమెరికా రీఫ్యూయలింగ్ విమానం.. నలుగురు సిబ్బంది మృతి

ABN , Publish Date - Mar 13 , 2026 | 04:50 PM

అమెరికా వాయుసేనకు చెందిన రీఫ్యూయలింగ్ విమానం కేసీ-135 ఏరియల్ ట్యాంకర్ శుక్రవారంనాడు పశ్చిమ ఇరాక్‌లో కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని ఆరుగురు సిబ్బందిలో నలుగురు మృతి చెందినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించింది.

ఇరాక్‌లో కుప్పకూలిన అమెరికా రీఫ్యూయలింగ్ విమానం.. నలుగురు సిబ్బంది మృతి
US military aircraft

బాగ్దాద్: అమెరికా వాయుసేనకు చెందిన రీఫ్యూయలింగ్ విమానం కేసీ-135 ఏరియల్ ట్యాంకర్ శుక్రవారంనాడు పశ్చిమ ఇరాక్‌లో కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని ఆరుగురు సిబ్బందిలో నలుగురు మృతి చెందినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించింది. రెండు సైనిక ట్యాంకర్ విమానాలు ల్యాండ్ అవుతుండగా ఒక విమానం కూలిపోయిందని, మరొకటి సురక్షితంగా ల్యాండ్ అయిందని తెలిపింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ సందర్భంగా ఫ్రెండ్లీ ఎయిర్ స్పేస్‌లో ఈ ఘటన జరిగినట్టు తెలిపింది. శత్రువుల దాడి వల్లనో, ఫ్రెండ్లీ ఫైర్ వల్లనో విమానం కూలిపోలేదని వెల్లడించింది. అసలు కారణంపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నామని చెప్పింది.


ఇది మా పనే..

కాగా, అమెరికా విమానాన్ని తామే కూల్చేసినట్టు ఇరాక్‌కు చెందిన ఇస్లామిక్ రెసిస్టెన్స్ రెబల్ గ్రూప్ ప్రకటించింది. తమ దేశ సౌర్వభౌమాధికారం, ఎయిర్‌స్పేస్‌ రక్షణ కోసం ఈ పని చేసినట్టు తెలిపింది. ఇరాన్ తరఫున ఈ ఇస్లామిక్ రెసిస్టెన్స్ గ్రూప్ పనిచేస్తోంది.


ఇంతవరకూ..

ఇరాన్‌తో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఏడుగురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురు కువైట్‌లోని సివిలియన్ పోర్ట్‌‌పై ఇరాన్ డ్రోన్ దాడిలో మృతిచెందగా, ఏడో వ్యక్తి సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌పై జరిగిన దాడిలో గాయపడి ఆ తర్వాత మృతి చెందాడు. ఈ ఘర్షణలో 140 మంది అమెరికా సైనికులు గాయపడ్డారని, వీరిలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారని పెంటగాన్ ఈవారం మొదట్లో పేర్కొంది.


ఇవి కూడా చదవండి..

వారిని అంతం చేస్తాను.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక

'మీరు శాంతిని కోరుకుంటే.. కూర్చుని మాట్లాడుకుంటే చాలు'

Updated Date - Mar 13 , 2026 | 05:42 PM