అమెరికాలో టాప్ బ్యాంకులకు సాంకేతిక సమస్య.. ఆన్లైన్ సేవల్లో అంతరాయం..
ABN , Publish Date - Nov 17 , 2026 | 10:25 AM
అమెరికాలోని ప్రముఖ బ్యాంకుల ఖాతాదారులు ఆన్లైన్ బ్యాంకింగ్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా వేలాది మంది వినియోగదారులు తమ బ్యాంకు ఖాతాలను యాక్సెస్ చేయలేకపోయారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని ప్రముఖ బ్యాంకుల ఖాతాదారులు ఆన్లైన్ బ్యాంకింగ్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా వేలాది మంది వినియోగదారులు తమ బ్యాంకు ఖాతాలను యాక్సెస్ చేయలేకపోయారు. ముఖ్యంగా జేపీ మోర్గాన్ చేజ్ (JPMorgan Chase) వ్యవస్థల్లో ఏర్పడిన సమస్య ఇతర బ్యాంకులతో జరిగే లావాదేవీలపైనా ప్రభావం చూపించింది. ఈ సాంకేతిక సమస్య కారణంగా చేజ్ బ్యాంకుతో లావాదేవీలు జరిపే బ్యాంక్ ఆఫ్ అమెరికా, వెల్స్ ఫార్గో, యూఎస్ బ్యాంక్, సిటీగ్రూప్ తదితర సంస్థల ఖాతాదారులు సమస్యలు ఎదుర్కొన్నారు (US Bank Outage).
అమెరికాలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన జేపీ మోర్గాన్ చేజ్ అంతర్గత హార్డ్‌వేర్ వ్యవస్థల్లో సాఫ్ట్వేర్ లోపం తలెత్తింది. దీంతో ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకునే సమయంలో ఖాతాదారులకు సమస్యలు ఎదురయ్యాయి. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తున్నామని బ్యాంకు ప్రతినిధులు వెల్లడించారు. డౌన్‌డిటెక్టర్ గణాంకాల ప్రకారం సోమవారం మధ్యాహ్నం సమయానికి చేజ్ బ్యాంకు సేవలపై 5 వేలకు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా సేవలపై సుమారు 1,500 ఫిర్యాదులు వచ్చాయి (JPMorgan Chase).
ఇతర బ్యాంకుల నియోగదారులకూ సమస్యలు ఎదురయ్యాయి (US Online Banking Issues). అమెరికాలో బ్యాంకుల మధ్య నగదు బదిలీలకు ఉపయోగించే జెల్లే (Zelle) సేవలను వినియోగించే వారికీ కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ముఖ్యంగా చేజ్ ఖాతాదారులతో లావాదేవీలు జరిపే ఇతర బ్యాంకుల వినియోగదారులకు నగదు బదిలీలో ఆలస్యం జరిగినట్లు సమాచారం. తమ అంతర్గత హార్డ్‌వేర్ వ్యవస్థల్లో ఏర్పడిన సాఫ్ట్వేర్ లోపమే ఈ సమస్యకు కారణమని, దీనికి సైబర్ దాడితో సంబంధం లేదని జేపీ మోర్గాన్ చేజ్ స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి..
హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి.. ఒమన్ తీరానికి సమీపంలో ట్యాంకర్‌కు మంటలు..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..