ట్రంప్ లాంటి ద్రోహిని, నేరస్థుడిని వదలకూడదు.. కాల్పులకు ముందు నిందితుడు ఏం రాశాడంటే..
ABN , Publish Date - Apr 27 , 2026 | 11:47 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం పాల్గొన్న వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. 31 ఏళ్ల కోల్ టొమాస్ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడు ముందుగా ఒక నోట్ రాసి, తన కుటుంబానికి సందేశం పంపినట్లు అధికారులు వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం పాల్గొన్న వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. 31 ఏళ్ల కోల్ టొమాస్ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడు ముందుగా ఒక నోట్ రాసి, తన కుటుంబానికి సందేశం పంపినట్లు అధికారులు వెల్లడించారు. నిందితుడు ఈ దాడిని ప్రణాళికాబద్ధంగా నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు (White House dinner shooting).
టొమాస్ తన కుటుంబ సభ్యులకు పంపిన నోట్‌లో 'బాలలను లైంగికంగా వేధించేవాడు, అత్యాచారి, దేశద్రోహి అయిన వ్యక్తిని ఇకపై ఏ మాత్రం అంగీకరించను' అని పేర్కొన్నట్టు తెలుస్తోంది. అలాగే తాను ఎవరెవరిని టార్గెట్ చేయదలచుకున్నాడో కూడా ఓ జాబితా రాసుకున్నాడు. తన జోలికి రానంత వరకు అతిథులు, ఇతర సిబ్బంది, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లపై కాల్పులు జరపనని కూడా ఆ నోట్‌లో పేర్కొన్నట్టు సమాచారం. కాగా, నిందితుడు రాసుకున్నది ఎవరి గురించనే విషయంలో పూర్తి క్లారిటీ లేదు (Suspect manifesto Trump).
'నిందితుడు రాసుకున్నది మీ గురించే అని భావిస్తున్నారా' అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు (Trump assassination attempt). 'అతడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. నేను రేపిస్ట్‌ను కాను. నేను ఎవరిపైనా అత్యాచారానికి పాల్పడలేదు. ఏ మాత్రం సంబంధం లేని వాటిని నాకు ముడిపెట్టారు. నేను నిర్దోషిని' అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా, నిందితుడు రాసుకున్న నోట్ గురించి అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
రష్యాకు ఇరాన్ విదేశాంగ మంత్రి.. అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ..
న్యూజిలాండ్‌తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ ఏడాది చివరి నుంచి అమల్లోకి..