హెచ్-1బీ వీసాల మోసాలను అరికట్టడమే ప్రధాన లక్ష్యం: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
ABN , Publish Date - Jul 09 , 2026 | 01:54 PM
అమెరికాలో హెచ్-1బీ వీసాల దుర్వినియోగంపై ట్రంప్ ప్రభుత్వం భారీ స్థాయిలో దర్యాప్తు ప్రారంభించింది. వీసా మోసాలకు పాల్పడిన వారిపై కార్మిక శాఖ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిందని, విచారణ నిమిత్తం కొందరికి నోటీసులు కూడా పంపించిందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడించారు.
అమెరికాలో హెచ్-1బీ వీసాల దుర్వినియోగంపై ట్రంప్ ప్రభుత్వం భారీ స్థాయిలో దర్యాప్తు ప్రారంభించింది. వీసా మోసాలకు పాల్పడిన వారిపై కార్మిక శాఖ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిందని, విచారణ నిమిత్తం కొందరికి నోటీసులు కూడా పంపించిందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడించారు. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలని స్పష్టం చేశారు (US H1B Visa).
తాజాగా విస్కాన్సిన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో జేడీ వాన్స్ మాట్లాడారు. కొన్ని పెద్ద కంపెనీలు, మధ్యవర్తులు ఈ హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, తక్కువ వేతనాలకు విదేశీయులను నియమించుకుంటూ అమెరికన్ల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తున్నారని వాన్స్ పేర్కొన్నారు. వీసా వ్యవస్థను మోసపూరితంగా ఉపయోగించే వారిని అమెరికాలోకి అనుమతించబోమని ఆయన హెచ్చరించారు (JD Vance H1B Fraud).
పన్ను చెల్లింపుదారుల సొమ్మును కాపాడడంతో పాటు వీసా దుర్వినియోగాన్ని అరికట్టడమే ట్రంప్ ప్రభుత్వ లక్ష్యమని వాన్స్ తెలిపారు (US Visa News). కాగా, ప్రతి ఏటా జారీ అయ్యే హెచ్-1బీ వీసాల్లో భారతీయులే అధిక వాటా పొందుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో 7.3 లక్షల మంది హెచ్-1బీ వీసాదారులు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిసి దాదాపు 12.8 లక్షల మంది హెచ్-1బీ వీసాలతో అమెరికాలో ఉంటున్నట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి..
మరోసారి ఇరాన్‌పై అమెరికా దాడులు.. కొనసాగుతున్న ఉద్రిక్తత..
మరింతగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..