ఖతార్ మిలటరీ హెలికాప్టర్ కుప్పకూలి ఆరుగురు మృతి
ABN , Publish Date - Mar 22 , 2026 | 03:40 PM
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఖతార్ మిలటరీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటన ఆదివారంనాడు చోటుచేసుంది. ప్రాదేశిక జాలాల్లో హెలికాప్టర్ కుప్పకూలి ఆరుగురు మృతి చెందారు.
దోహా: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఖతార్ మిలటరీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటన ఆదివారంనాడు చోటుచేసుంది. ప్రాదేశిక జాలాల్లో హెలికాప్టర్ కుప్పకూలి ఆరుగురు మృతి చెందారు. ఒకరి జాడ గల్లంతైంది. హెలికాప్టర్ కుప్పకూలడానికి సాంకేతక లోపం కారణమని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రొటీన్ విధుల్లో పాల్గొన్న సమయంలో ప్రాంతీయ జలాల్లో హెలికాప్టర్ కుప్పకూలినట్టు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొంది.
మధ్యప్రాచ్యంలో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఖతార్‌పై పలుసార్లు దాడులు చోటుచేసుకున్నాయి. అయితే తాజా ఘర్షణలకు, హెలికాప్టర్ కుప్పకూలడానికి ఎలాంటి సంబంధం లేదని ఖతార్ అధికారులు తెలిపారు. విశేష అనుభవం ఉన్న ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని, ప్రస్తుతం గాలింపు, సహాయక చర్యలు జరుగుతున్నాయని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసిన ఇరాన్.. జెరూసలెంను తాకిన మిసైల్..
అదే జరిగితే ముంబై, ఢిల్లీపై దాడులు చేస్తాం: పాక్ మాజీ హైకమిషనర్ షాకింగ్ కామెంట్