ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసిన ఇరాన్.. జెరూసలెంను తాకిన మిసైల్..
ABN , Publish Date - Mar 21 , 2026 | 09:43 PM
శత్రుదేశం ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడుతోంది. మిసైల్స్, డ్రోన్ దాడులతో విధ్వంసం సృష్టిస్తోంది. పవిత్ర రంజాన్ రోజు ఇరాన్ మిసైల్ జెరూసలెంలో పడింది. అది కూడా అల్ అక్సా మసీదుకు కొద్దిదూరంలో ఈ మిసైల్ దాడి జరిగింది.
ఇంటర్‌నెట్ డెస్క్: శత్రుదేశం ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడుతోంది. మిసైల్స్, డ్రోన్ దాడులతో విధ్వంసం సృష్టిస్తోంది. పవిత్ర రంజాన్ రోజు ఇరాన్ మిసైల్ జెరూసలెంలో పడింది. అది కూడా అల్ అక్సా మసీదుకు కొద్దిదూరంలో ఈ మిసైల్ దాడి జరిగింది. దీంతో వందలాది మంది ముస్లింలు ప్రార్థనలు నిలిపేయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో శనివారం ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో.. ‘రంజాన్ సందర్భంగా ఇరాన్ మిసైల్ జెరూసలెంలో పడింది. అది కూడా ముస్లింలు, క్రిస్టియన్స్, యూదుల పవిత్ర స్థలాలకు కొద్దిదూరంలో ఈ దాడి జరిగింది. ఇదీ ముల్లాల నిజ స్వరూపం’ అని పేర్కొంది.
ఇరాన్‌కు 22 దేశాల విజ్ఞప్తి
హోర్ముజ్ జలసంధిని తెరవాలని ఇరాన్‌కు 22 దేశాలు విజ్ఞప్తి చేశాయి. అంతేకాకుండా పొరుగు దేశాలపై దాడులను కూడా ఆపాలని కోరాయి. ఈ మేరకు ఇరాన్‌కు విజ్ఞప్తి చేస్తూ యూఏఈ, ఫ్రాన్స్, యూకే, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్, న్యూజిలాండ్, డెన్మార్క్, కెనడా, బహ్రెయిన్ తదితర దేశాలు సంయుక్త ప్రకటన చేశాయి. గల్ఫ్‌లోని నిరాయుధ నౌకలు, చమురు, గ్యాస్ కేంద్రాలు సహా మౌలిక సదుపాయాలపై ఇరాన్ జరిపిన దాడులను ఖండిస్తున్నట్టు ప్రకటించాయి.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్2026లో అమ్ముడుపోని ఇండియన్ బౌలర్ విధ్వంసం
మహిళల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్రాల కృషి: పెమ్మసాని చంద్రశేఖర్