ఐపీఎల్2026లో అమ్ముడుపోని ఇండియన్ బౌలర్ విధ్వంసం
ABN , Publish Date - Mar 21 , 2026 | 09:36 PM
ఐపీఎల్2026లో భాగంగా కేకేఆర్ ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌లో ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయిన నవదీప్ సైనీ విజృంభించాడు. న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ ఫిన్ అలెన్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 వేలంలో పలువురు ఆటగాళ్లు భారీ ధర పలికారు. మరికొందరు బేసిక్ ధరకు అమ్ముడుపోయారు. ఇంకొందరు అయితే అన్‌సోల్డ్ ప్లేయర్లుగా మిగిలి పోయారు. అలాంటి ఓ భారత ఆటగాడు తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. తన బౌలింగ్ తో బ్యాటర్లకు వణుకు పుట్టించాడు. ఇంతకీ ఆటగాడు ఎవరు, ఆ మ్యాచ్ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...
ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తన ప్రాక్టీస్‌ను ఆరంభించింది. ప్రాక్టీస్‌లో భాగంగా కేకేఆర్ ఆటగాళ్లంతా శుక్రవారం పర్పుల్ నైట్స్, గోల్డెన్ నైట్స్‌గా విడిపోయి ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడారు. గోల్డెన్ నైట్స్ విధించిన 200 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో పర్పుల్ నైట్స్‌కు మంచి ఆరంభించింది. న్యూజిలాండ్ విధ్వంసరకర బ్యాటర్ ఫిన్ అలెన్ 10 బంతుల్లోనే 23 పరుగులు బాదాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2026 వేలంలో అమ్ముడుపోని నవదీప్ సైనీ బౌలింగ్‌కు వచ్చాడు. సైనీ వేసిన తొలి బంతిని ఫిన్ అలెన్ సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత బంతిని సైనీ యార్కర్ వేయగా అలెన్ వికెట్ నుంచి పక్కకు జరిగి భారీ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ బంతి ఫిన్ అలెన్ కాళ్ల మధ్యలో నుంచి వెళ్లి వికెట్లను గిరాటేసింది.
ఈ మ్యాచ్‌లో పర్పుల్ నైట్స్ 6 వికెట్ల తేడాతో గోల్డెన్ నైట్స్‌పై విజయం సాధించింది. అంగ్‌క్రిష్ రఘువంశీ 55 బంతుల్లోనే 103 పరుగుల మెరుపు సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన గోల్డెన్ నైట్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కాగా ఫిన్ అలెన్‌ను కోల్‌కతా రూ. 2 కోట్ల కనీస ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఫిన్ అలెన్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఐపీఎల్ 2026లో కేకేఆర్ తన తొలి మ్యాచ్‌ను మార్చి 29న ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. తొలి విడతలో ముంబైతో పాటు ఎస్‌ఆర్‌హెచ్, పంజాబ్, లక్నోతో తలపడనుంది.
ఇవి కూడా చదవండి:
అతడి స్థాయిని ఎవరూ భర్తీ చేయలేరు: కె. శ్రీకాంత్
రామ జన్మభూమిని దర్శించిన ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్, కెప్టెన్ పంత్..