అదే జరిగితే ముంబై, ఢిల్లీపై దాడులు చేస్తాం: పాక్ మాజీ హైకమిషనర్ షాకింగ్ కామెంట్
ABN , Publish Date - Mar 22 , 2026 | 01:03 PM
పాశ్యాత్య దేేశాలు తమను టార్గెట్ చేస్తే తాము భారత్‌పై విరుచుకుపడతామంటూ పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ తాజాగా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ తాజాగా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. పాశ్చాత్య దేశాలు తమను టార్గెట్ చేస్తే తాము భారత్‌పై దాడులకు దిగకతప్పదని అన్నారు. ముంబై, న్యూఢిల్లీ లాంటి నగరాలపై మరో ఆలోచన లేకుండా దాడి చేస్తామని చెప్పారు. ఆ తరువాత ఏం జరుగుతుందనేది అప్పుడు తేల్చుకుంటామని వ్యాఖ్యానించారు.
పాక్‌కు మరో దారిలేకపోతే జరిగేది ఇదేనని అబ్దుల్ బాసిత్ వ్యాఖ్యానించారు. అయితే, ఇలాంటివి జరిగే అవకాశాలు చాలా తక్కువని, దాదాపు అసాధ్యమని కూడా వివరణ ఇచ్చారు. ‘మాకు హాని తలపెట్టేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే భారత్‌పై దాడి మినహా మరో ప్రత్యామ్నాయం ఉండదు’ అని వ్యాఖ్యానించారు. ఇలాంటివి జరగాలని భారత్‌తో పాటు తామూ కోరుకోవట్లేదని చెప్పారు. బాసిత్ నేరుగా న్యూఢిల్లీ, ముంబై నగరాలను పేర్కొనడంతో ఈ ఉదంతం ప్రస్తుతం కలకలం రేపుతోంది.
పాశ్చాత్య దేశాల దాడిని నేరుగా ఎదుర్కునే వ్యూహం పాక్ వద్ద లేదనే అంశాన్ని బాసిత్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాశ్చాత్య దేశాలపై పాక్ ప్రతీకార దాడులు చేయలేనప్పుడు చివరిగా భారత్‌ను టార్గెట్ చేయాలన్న వ్యూహం కనిపిస్తోందని అంటున్నారు. పాక్ అణ్వాయుధాలతో తమకు ముప్పు పొంచి ఉందని అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసీ గబ్బార్డ్ ఇటీవల పేర్కొన్నారు. భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి కూడా పాక్ ఒక ధూర్త దేశమని ఇటీవల మండిపడ్డారు.
ఇక 2014-17 మధ్య కాలంలో అబ్దుల్ బాసిత్ భారత్‌లో పాక్ హైకమిషనర్‌గా పని చేశారు. దౌత్యవేత్తగా కీలక బ్యాధతలను నిర్వహించిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పాక్ ఇటీవల అఫ్గానిస్థాన్‌పై పలు వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఎందరో అమాయకులు, సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారని తాలిబాన్లు ఆరోపిస్తున్నారు.
ఈ వార్తలూ రాయండి:
ఇరాన్‌పై దాడుల తీవ్రత తగ్గిస్తాం: ట్రంప్
ప్రత్యేక విమానాల్లో ఖతార్ గుర్రాల తరలింప